Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు ఎన్నిసార్లు ముఖం శుభ్రం చేసుకున్నా జిడ్డు కారుతున్నట్టే ఉంటుంది. మరికొందరిది ఉదయం నుంచే పేలవంగా కనిపిస్తుంది. నిత్యనూతనంగా, తాజాగా కనిపించడానికి సౌందర్యనిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.
నిద్ర లేవగానే టిష్యూ పేపర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే చర్మం తీరును గుర్తించొచ్చు. దానికి తగినట్టుగా సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. మేకప్ వేసే ముందు ముఖాన్ని మూడు రకాలుగా క్లెన్సింగ్ చేయాలి.
ముందుగా చర్మంలోని నూనెను తొలగించడానికి ఫేస్‌వాష్‌తో శుభ్రం చేయాలి. ఆపై స్క్రబ్ చేసి, ఆవిరి పడితే.. మృతకణాలతోపాటు చర్మరంధ్రాల్లోని బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత వేసే మేకప్ వల్ల చర్మం పెద్దగా ప్రభావితం కాదు.
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్ లేకుండా ముఖాన్ని శుభ్రపరచాలి. ఆ తర్వాత సీరం, మాయిశ్చరైజర్ అప్లై చేస్తే స్కిన్ తేమను కోల్పోకుండా ఉండటమే కాదు, ఉదయానికి తాజాగా కూడా మారుతుంది.
తాజా కూరగాయలు, పండ్లు సలాడ్స్‌ను తీసుకోవడం, ఆరేడు గ్లాసుల నీటిని తాగడం వంటి అలవాట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మొటిమలు, మచ్చలనూ దరి చేరనివ్వవు. అప్పుడిక ముఖం నిత్య నూతనంగా, మెరుపులీనుతూ కనిపిస్తుంది.