Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందం... ఈ రోజుల్లో దీనికోసం ఎంతో డబ్బు ఖర్చు చేసే వారున్నారంటే ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. అయితే చాలా మంది తెలిసీ తెలియక వేలు ఖర్చుపెట్టి ఏవేవో పేస్ క్రీంలు వాడుతుంటారు. అయితే మన ఇంట్లో చేసుకునే కొన్ని ప్యాక్‌లు మన చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి తోడ్పడుతాయి. చల్లటి వాతావరణం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దాంతో చర్మం తరచుగా జిడ్డుగా, నిర్జీవంగా మారుతుంది. ఇది మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. వాతావరణ పరిస్థితులు, కలుషితమైన గాలి కారణంగా ముఖంతో తేజస్సు కూడా తగ్గిపోతుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడినా చర్మం జిడ్డుగా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటిస్తే జిడ్డును తొలగించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
గోరు వెచ్చటి నీటితో: ఆయిల్ స్కిన్‌తో బాధపడేవారు ప్రతిరోజు గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6 సార్లు శుభ్రపరచుకోవాలి. యాపిల్ని రౌండ్ ముక్కలుగా కట్ చేసి ముఖంపై 30 పై నిమిషాలు పెట్టుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే జిడ్డునంతా ఆపిల్ ముక్కలు పీల్చేసి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
నారిజం తొక్కలతో: స్పూన్ నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడి, ఒక టేబు స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.
బయటికి వెళ్లేముందు ఐస్ క్యూబ్: బయటికి వెళ్లేముందు ఐస్ క్యూబ్‌తో ముఖాన్ని మర్దనా చేయాలి. ముఖంపై తడి ఆరిన తర్వాత మేకప్ చేసుకుంటే చర్మం జిడ్డు లేకుండా ఎక్కువ సేపు తాజాగా మెరుస్తూ ఉంటుంది.
బొప్పాయితో: బొప్పాయిని గుజ్జుగా చేసి అందులో నిమ్మ రసం, అర కప్పు బియ్యం పిండి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై సుతిమెత్తగా మర్దనా చేయాలి. చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది. ప