Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పింపగన్''... చిన్నప్పుడు బడిలో తెలుగు
వాచకంలో చదివిన ఈ పద్యం అక్షరాలా నిజం. ఆడపిల్లలకు కాస్త ప్రోత్సాహం, కొంచెం
శ్రద్ధ అందజేస్తే ఎన్నో శిఖరాలు అధిరోహిస్తారు. కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎంతో
పేరు ప్రఖ్యాతులు తెస్తారు. అందుకు ఎన్నో సజీవ సాక్ష్యాలు మన కళ్ళముందే వున్నాయి.
స్వయం శక్తితోనే ఎదిగిన మహిళ చైతన్యం ఆమె. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి
మహిళా టింబర్ డిపో యజమానిగా ఎదిగిన ప్రియ అడపా పరిచయం.
తిండిలేని పరిస్థితి నుంచి ఉన్నత పారిశ్రామికవేత్తగా ఎదిగారు. నాడు ఛీత్కరించే నోరులే.. నేడు ఆమెను ప్రశంసిస్తున్నారు. అంతే కాదు ఆమె అభివద్ధిని చూసి నేడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టింబర్ డిపో యజమానిగా ఎదిగారు ప్రియ అడపా ఉద్యోగిగా చేరిన కంపెనీకే యజమాని అయ్యారు. ముళ్ళబాటను రెండు దశాబ్దాలలో పూలబాటగా మార్చుకున్నారు. ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ తయారీలతో వ్యాపారంలో ముందడుగు వేస్తున్నారు. ప్రియ అడపా ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్‌గా లేడీ లెజెండ్ అవార్డును అందుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో, మా అమ్మమ్మ ఇంట్లో ఏడాదిపాటు పెరిగారు. ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.
ఎక్కువ కాలం ఎవరో ఒకరిపై ఆధారపడి ఉండటం వారికి ఇబ్బందే. అలా ఉండటం ఇష్టంలేని ఆమె పదమూడో ఏట రెండు వేల రూపాయల ఉద్యోగానికి హైదరాబాద్ వచ్చేశారు. కొంతకాలానికి ఒక టింబర్ డిపోలో ఐదు వేల రూపాయల జీతానికి రిసెప్షనిస్టుగా చేరావు. ఐదేండ్ల వయసులో తల్లిని కొల్పోయిన ఆమెకు పదకొండేండ్ల వయసులో తండ్రి కూడా దూరమాయ్యరు. తండ్రి ఉండగానే ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలవాల్సి రావడంతో ఆమె ఒక ఆస్పత్రిలో పని చేశారు. అది కూడా అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి చాలా ఉపయోగపడింది.
అప్పుడు ఉద్యోగి.. ఇప్పుడు యజమాని
రిసెప్షనిస్టుగా పనిచేసిన అదే టింబర్ డిపోకు ఇన్చార్జి బాధ్యతలు కూడా చేపట్టారు. ఉద్యోగం చేస్తూనే, బీకాం కంప్యూటర్స్ చేశారు. క్రమేపీ ఆ జీతం లక్ష రూపాయలకు చేరింది. ఈ డిపోలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరిగేది. కొంతకాలానికి ఆ యజమాని విదేశాలకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో డిపో మూసేద్దామను కున్న ఆలోచనకు వచ్చారు. దీంతో అప్పుడి దాకా ఉపాధి పొందిన తనతో పాటు అనేక మంది రోడ్డున పడతారు. అదే ఆమెలో ఆలోచన కల్గించింది. దీంతో అంతకాలం ఆమె దాచుకున్న డబ్బుతో గుడ్ విల్ కింద రూ. 8 లక్షలు చెల్లించి 2013లో ఆ కంపెనీని కొన్నారు. అదే అప్పుడు 'ఎకో నేచురల్' అనే బ్రాండ్ ఆమెది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు.
స్నేహితుల సహకారంతో..
కంపెనీ బాధ్యతలు చేపట్టి నప్పుడు ఏడాది పాటు సమ స్యలు అనేక ఎదుర్కొ న్నారు. ఆమె అను భవమే వాటికి సమా ధానం అయ్యాయి. ఆమె స్నేహితుల సహకారంతో ఓపెన్ స్పేస్‌లో షెడ్ వేసి, లైసెన్స్ కొనుక్కుని కంపెనీని విస్తరించారు. ఒక అమ్మాయి ఇంత పెద్ద ఆర్డర్ చేస్తుందా అని కొందరు, అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అని కొందరు, ఆడపిల్ల కనుక మోసం చేయదని కొందరు... ఇలా ఏదైతే ఏం ఆమెకు ఆర్డర్లు ఇస్తున్నారు. టింబర్ డిపోలో నాణ్యమైన టేకు చెక్క మాత్రమే సప్లయి చేస్తున్నాను. టేకు చెక్కతో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగిగా ఉన్నప్పుడే ఆ కంపెనీలోనే పని చేసిన అనుభవం, మేనేజర్ గా కలప కొనడానికి వెళ్లిన పరిచయాలు అన్ని ఆమెకు బాగా ఉపయోగపడ్డాయి. మంచి కలప ఎక్కడ దోరుకుతుందో అక్కడకు ఆమె స్వయంగా వెళ్లి దాని నాణ్యత చూసి తెచ్చుకోవడం, స్వయంగా ఆమె కూడా ఆ పనిలో తన వర్క్స్ తోపాటు పని చేయడం చేస్తారు. వాడగా మిగిలిన కలపతో ఆమె తన అనుభవాన్ని ఉపయోగించి, వాటితో చిన్న చిన్న ఇంటీరియర్స్ చేయటం ప్రారంభించారు. దాంతో నష్టాల నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఆమె సంవత్సరానికి మూడు కోట్లు నేను స్వయంగా ఒక ఎకరంలో పూర్తిగా టేకు చెక్కతో ఫామ్ హౌస్ కట్టారు.
20 ఏండ్ల స్ట్రగుల్
ఒంటరిగా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆశలు చూపిస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ ఆశలు కొంతకాలం వరకే ఉంటాయి. పదిరోజుల ఆనందం కోసం ఎదురు చూస్తే, జీవితాంతం బాధపడాలి. నాకు ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు చూపించారు. వేటికీ లొంగకుండా, వ్యక్తిత్వంతో నిలబడ్దాను. ఉన్నత స్థాయికి ఎదిగాను. అందరికీ ఇప్పుడు నేను కొనుక్కున్న కారు, ఇల్లు కనిపిస్తాయి. ఈ స్థాయికి రావడం వెనుక 20 ఏండ్ల స్ట్రగుల్ ఉంది. తన అక్క, తమ్ముడు బాధ్యత కూడా ఆమె తీసుకుంది. ఉద్యోగం చేస్తూనే తన చదువుకుంటూ తమ్మున్ని, అక్కని కూడా చదివించింది. వీటితో పాటు తన అభిరుచిని నాట్యం, కారాటిలో కూడా నేర్చుకుంది.