Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిమ్మల్ని మీరు ఓసారి పరీక్షించుకోండి. తర్వాత ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే బదుల్విండి. అప్పుడు బంధాలు దూరమవ్వవు. తరచూ అసహనానికి గురవుతుంటే కారణం కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఏదీ తట్టలేదంటే ఒత్తిడిగా భావించొచ్చు. సరిగా తినకపోవడం వల్ల కూడా ఇలా కావొచ్చు. దాని ఆధారంగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరి.
- విసుగు అనిపించినప్పుడల్లా అన్నీ తమకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయన్న భావన కలుగుతుంది. ఈ రకమైన ఆలోచనకి శరీరంలో కార్టిసాల్ అధిక మోతాదులో ఉత్పత్తి కావడమే కారణం. ఇలాంటప్పుడు ప్రశాంతమైన చోట కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేయడం లేదా కొద్దిసేపు శ్వాసను బంధించి ఉంచడం లాంటివి చేయాలి.