Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టి ప్రమిదలు, రంగ వల్లులు, మెరిసే అద్భుత దీపాలు, రుచికరమైన ఆహారం, కుటుంబ సమావేశాలతో ఆకర్షణీయంగా ఉండే దీపావళి వేడుక కోసం ఎంతో మంది అత్యంత ఆసక్తికరంగా చూస్తుంటారు. దీపావళి పండుగ వేళ అత్యంత ఆసక్తిగా కనిపించే పురాతన సంప్రదాయం బహుమతులు మార్చుకోవడం ఒకటి. మీ ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడపడాన్ని మించిన తియ్యందనం ఏదీ లేదన్నది నిజమే. అయినా ఆలోచనాత్మకంగా, అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న బహుమతులు ఈ పండుగ వేడుకలకు మరింత విలువను, అర్థం అందిస్తాయి. చక్కటి ఆరోగ్యానికి బాదములు ప్రసిద్ధి. వీటిలో విటమిన్ ఈ, డైటరీ ఫైబర్, ప్రొటీన్, రిబోఫ్లావిన్, మాంగనీస్, ఫోలేట్ మొదలైన 15 అత్యవసర పోషకాలు ఉంటాయి. బాదములు తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం, మధుమేహం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణ పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. వీటిని మీరు అభిమానించే వారికి బహుమతిగా అందిస్తే వారి ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారు.
సుప్రసిద్ధ ఫిట్నెస్, సెలబ్రిటీ ఇన్స్ట్రక్టర్, యాస్మిన్ కరాచీవాలా ఏమంటారంటే 'ప్రియమైన వారిని కలుసుకునేందుకు, నూతన జ్ఞాపకాలను నిలుపుకునేందుకు అత్యద్భుతమైన సందర్భం దీపావళి. పండుగల హడావుడిలో పండి చాలామంది తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపడం లేదు. శారీరక వ్యాయామాల క్రమాన్నీ అనుసరించడం లేదు. ప్రతి రోజూ కచ్చితంగా 30 నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామాలను చేయడాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఆఖరకు పండుగ వేడుకలకు సిద్ధమవుతున్నా, అది తప్పనిసరి. ఈ వ్యాయామాలలో భాగంగా నడక, ఇంటిలో వర్కవుట్స్చేయడం, వర్కవుట్ కోసం జిమ్‌కు వెళ్లడం ఏదైనా చేయవచ్చు. వీటితో పాటుగా పౌష్టికాహార బహుమతులు అయినటువంటి బాదములను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ప్రోటీన్ అధికంగా బాదములలో లభ్యమవుతుంది. ఫైబర్ కూడా దీనిలో అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన, ఆకలి తీర్చే స్నాక్. ఇది భోజనాల నడుమ ఆకలి తీర్చుకోవడానికి అనుకూలంగా ఉండటంతో పాటుగా అధికంగా చిరుతిళ్లపై ఆధారపడటమూ తగ్గిస్తుంది' అంటున్నారు.