Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెండకాయలో ఎంతో ఉపయోగకరమైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్ ఎ, బి, సి, అయోడిన్, ఫోలేట్, పిండి పదార్థాలు, పీచు పదార్థం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం ఉన్నాయి. ఇందులో ఖనిజాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, పుష్కలంగా ఉండడంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది మెదడుకు ఆలోచనా శక్తి పెంచి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర వ్యాధి తగ్గించి షుగర్ వ్యాధి గ్రస్తులకు సహాయం చేస్తుంది. దీనిలోని మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట పోగొట్టి కడుపులో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు గ్యాస్స్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. బెండకాయలోని లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకొంటాయి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది.
బెండకాయను తరచూ తింటే యూరినరీ ఇన్షెక్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని కె-విటమిన్ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియంను శోషించుకోవడానికి వీటిలోని ఇ విటమిన్ దోహదపడుతుంది. అయితే బెండలో ఫ్రక్టేన్లూ, ఆక్సలేట్లూ, సొలమిన్లు ఉండడంవల్ల మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ల నొప్పులున్నవాళ్లు తగు మోతాదులో తీసుకోవాలి.
బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరం తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి, నీటిలో మరిగించి, చల్లారాక తాగితే శరీరంలో ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ నియంత్రణలోనూ పనిచేస్తుంది. దీనిలోని పెక్టిన్ బ్లడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. విటమిన్ సి ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యల్ని దూరంగా పెడుతుంది. బెండకాయ రసంలో వండిన కూరలో కన్నా అధిక పోషకాలు ఉంటాయి. దీన్ని సేవించడంవల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అనీమియా నివారణకు ఔషధంలా పనిచేస్తుంది. బెండ రసంలో విటమిన్ - సి, ఎ, మెగ్నీషియం ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలున్న ఈ రసంతో తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఇందులో ఇన్సులిన్ గుణాలు అధికం. రోజూ తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బెండకాయ నీటిని పరగడుపునే తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఆ నీటి తయారీకి ముందుగా రెండు బెండకాయలను తీసుకొని బాగా కడగాలి. వాటి మొదలు, చివర భాగాలను కట్ చేయాలి. తర్వాత బెండ కాయలను నిలువుగా చీరాలి. వాటిని ఒక గ్లాసు నీటిలో వేసి మూత పెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే బెండ ముక్కలు తీసేసి నీటిని తాగాలి. దీనివల్ల పేగులు, జీర్ణాశయం శుభ్రమవుతాయి.
అల్సర్లు, గ్యాస్, మలబద్దకం, బీపీ వంటివి తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగవుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలు నయమవుతాయి. వేడి శరీరం ఉన్నవారికి కూలెంట్‌గా పనిచేస్తుంది. కొవ్వు కరిగిస్తుంది. చర్మం కాంతిమంతంగా, జుట్టు దృఢంగా, ఒత్తుగా ఉంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నేత్ర సమస్యలను కూడా నివారిస్తుంది. ప