Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంధ్యా బాలకృష్ణన్... డేటా అనలిటిక్స్, ఇంజినీరింగ్ సీనియర్ డైరెక్టర్‌గా ఆమె నైపుణ్యం అద్భుతమైనది. డిజిటల్ సొల్యూషన్స్, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, సప్లై చైన్ ఫంక్షన్ల కోసం డేటా/ఏఐ ఉత్పత్తుల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో ఆమె పాత్ర కీలకంగా ఉంది. పి అండ్ ఎల్, పీపుల్ మేనేజ్మెంట్ బాధ్యతలతో బహుళ కస్టమర్లు, ప్రాంతాలలో సంక్లిష్టమైన, విభిన్నమైన వ్యాపార పోర్ట్‌ఫోలియోను నిర్వహించి టెక్నాలజీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ రంగంలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె హర్ స్టోరీతో పంచుకున్న అనుభవాలు మానవి పాఠకుల కోసం...
సంధ్యా బాలకృష్ణన్ స్త్రీపురుష సమానత్వాన్ని సాధించడం కోసం తన కంపెనీ నిర్వహిస్తున్న వావ్ (విత్ అవర్ ఉమెన్) ప్రోగ్రామ్‌లో పాల్గొంటుంది. ఆమె తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పూర్తి చేశారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేశారు. అంతే కాదు ఆమె శాస్త్రీయ నృత్యకారిణి.
ఇంజనీరింగ్ నా ఎంపిక కాదు
చదువుకునే రోజుల్లో నేను చారిత్రక అంశాలలో ఎంతో నైపుణ్యం చూపేదాన్ని. కానీ మొదట్లో ఇంజనీరింగ్ నా ఎంపిక కాదు. ఎందుకంటే ఆర్థిక శాస్త్రం, చరిత్ర వైపు ఎక్కువ మొగ్గు చూపేదాన్ని. అయితే చదివింది మాత్రం ఇంజినీరింగ్. ఎందుకంటే అప్పట్లో నాకు ప్రత్యామ్నాయ ఎంపికల గురించి పూర్తిగా తెలియదు. కానీ నా ఇంజనీరింగ్ రోజుల్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కంప్యూటర్లు, సైన్స్, గణితంలో మంచి నైపుణ్యం ఉన్న నేను సహజంగానే సాంకేతికతలోకి వెళ్ళిపోయాను. క్రమంగా విశ్లేషణలతో నా స్థానాన్ని తెలుసుకున్నాను. గణితం, వ్యూహం, సృజనాత్మకతలో నా బలాన్ని పెంచుకున్నాను. సంవత్సరాలుగా స్టీమ్ ప్రాంతంలో సహకరించడానికి అసరమైన సౌకర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకున్నాను.
పాఠాలు నేర్చుకుంటూ...
2008లో హైదరాబాద్‌లో డెలాయిట్‌తో నా కెరీర్‌ని ప్రారంభించాను. అద్భుతమైన మెంటర్లతో నా కెరీర్‌ని ప్రారంభించడానికి ఇది ఓ గొప్ప ప్రదేశం అని చెప్పవచ్చు. చాలా ప్రారంభ దశలోనే మా టీంతో కలిసి ప్రాజెక్ట్‌లను నిర్వహించడం విలువైనదిగా అనిపించింది. 2009 నుండి 2012 వరకు చికాగోలో గడిపాను. కన్సల్టింగ్ రంగంలో పాఠాలు నేర్చుకుంటూ కొత్త దేశంలో గొప్పగా గడిపానని చెప్పాలి. అయితే ఇంకా ఏదో సాధించాలనే తపన ఉండేది. ఇది నన్ను మళ్లీ చదువుల వైపు నడిపించింది. బిజినెస్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం ఐఎస్‌బిలో చేరాను. అక్కడ విభిన్న విభాగాలు, విద్యార్థులు, స్నేహితులతో కలిసి నేర్చుకోవడం ఓ అద్భుతమైన అనుభవం. తర్వాత కొంత కాలం డెలాయిట్‌కి తిరిగి వెళ్లాను. అది నా కంఫర్ట్ జోన్ లాగా అనిపించింది. దాంతో ఓ సంవత్సరం తర్వాత ఫిబ్రవరి 2014లో కొత్తగా ఏర్పాటైన బ్రిల్లియో సంస్థలో చేరాను. సీనియర్ కన్సల్టెంట్‌గా పని ప్రారంభించాను. 2015 ప్రారంభంలో అనాలసిస్ విభాగానికి మారాను. ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను.
సరైన సమయంలో సరైన పరిష్కారం
ప్రస్తుతం ప్రాక్టీస్ కోసం గో-టు-మార్కెట్ డ్రైవింగ్ చేసే బాధ్యత నాపై ఉంది. మేము వారి కోసం సరైన డేటా వ్యూహం, రోడ్‌మ్యాప్‌ను నిర్వచించడం, వారి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం, సరైన సమయంలో సరైన పరిష్కారాలను డిజైన్ చేయడం కోసం మా క్లయింట్లతో సంప్రదించడం ఇందులో ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లో మా బృందం దాదాపు 6-7కు పెరిగింది. కస్టమర్ల అతి కష్టమైన సమస్యలను పరిష్కరించడం, బృందంతో స్కేలింగ్ చేయడంతో పాటు, ఇది ఓ ఉత్తేజకరమైన అనుభవంగా ఉంది. కొత్త జట్టు సభ్యులు వేగంగా అభివృద్ధి చెందుతున్న జట్టులో విజయం సాధించడంలో సహాయపడింది. మహమ్మారి సమయంలో ఆఫీసు నుండి అకస్మాత్తుగా నెలల తరబడి ఇంటి నుండి పని చేయవలసి రావడం ఒక కుదుపు. నేను ఎప్పటిలాగే వ్యాపారానికి అంతరాయం లేకుండా ఉండేలా చూసుకుంటూ కస్టమర్లు, వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి కొత్త మార్గాలను నేర్చుకోవలసి వచ్చింది.
శ్రామికశక్తిలో మహిళలు
అనేక సంస్థలు వైవిధ్యం గురించి మాట్లాడుతున్నారు. కానీ మహిళలను టెక్నికల్ రంగంలోకి ఆహ్వానించడం గురించి ఇప్పటికీ సరిగా అర్థం కాలేదు. శ్రామికశక్తిలో మహిళలను నిలుపుకోవడానికి ఇది వారధి. ఇప్పటికీ మన సమాజంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. సంస్థలు మహిళల ప్రవేశం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. మహిళలు అవకాశాలను కోల్పోకుండా ఉండేలా వారిని గుర్తించడం, వారితో ఎలా వ్యవహరించాలనే దాని గురించి శిక్షణ ఇవ్వాలి. దీనర్థం పని విధానం, ఆలోచనలు, నాయకత్వ శైలులు సాధారణంగా పరిగణించబడే వాటికి భిన్నంగా ఉండవచ్చు. ఇది మహిళలకు పని వాతావరణాన్ని ఆస్వాదించడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తాయి.
అద్భుతమైన వృద్ధి
మా బృందం ఈ రోజు ఉన్న స్థాయికి ఎదుగుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇంకా మేము చాలా దూరం వెళ్ళవలసి వున్నా... మేము చాలా గర్వించదగిన పని పోర్ట్‌ఫోలియోతో అద్భుతమైన వృద్ధిని సాధించడం. పెరుగుదల అనేది కథలో మెరిసే భాగం అయితే ఇది జట్లను నిర్మించడం, స్థిరత్వం, కష్టమైన ఎంపికలు చేయడం వంటి అనేక సవాళ్లతో వస్తుంది. మేము మా కస్టమర్లలో చాలా మందితో కలిసి 'విమెన్ ఇన్ డేటా అండ్ ఏఐ' భాగస్వామ్య ఫోరమ్‌ను ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ ప్రదేశంలో మహిళలు నెట్వర్క్, ఆలోచనలను పంచుకునే ప్లాట్‌ఫారమ్‌గా పరిణామం చెందడమే కాకుండా తదుపరి తరం రాక్‌స్టార్ మహిళా నాయకులకు మార్గదర్శకత్వం వహించడం మా ముఖ్య లక్ష్యాలలో ఒకటి.
ఎంపికలు ఉండాలి
నాది కుంగిపోయే మనస్థ్తత్వం కాదు. మనకంటూ కొన్ని ఎంపికలు ప్రతి మహిళకూ ఉండాలి. వాటికి అనుగుణంగానే మనం అడుగులు వేయాలి. అవసరమైనప్పుడు వాటిని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం అనుకున్న సాధించలేము అనుకున్నప్పుడు మనం ఏమి చేయగలమో దాన్నే లక్ష్యంగా పెట్టుకుని విజయం సాధించాలి. ఏదేమైనా సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూసుకోవాలి.
దృఢ విశ్వాసంతో...
నేను మా అమ్మ నుండి చాలా ప్రేరణ పొందాను. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు పని చేయడానికి బయటకు రాని సమయంలోనే అమ్మ పని చేయడం ప్రారంభించింది. ఒక నిర్దిష్ట సమయంలో పని నుండి నిష్క్రమించడానికి, గృహిణిగా ఉండటానికి ఒక చేతన ఎంపిక చేసింది. పుస్తకాలు, కళలు, సినిమాలు మొదలైన అనేక ఇతర మార్గాల ద్వారా ఆమె తన మరో ప్రపంచాన్ని సృష్టించుకుంది. దృఢ విశ్వాసం మనల్ని మన లక్ష్యం వైపుకు తీసుకువెళుతుంది అనేది నేను మా అమ్మను చూసే నేర్చుకున్నాను.
మహిళల భాగస్వామ్యం పెరిగింది
మహిళలు ఒకరి అనుభవాల నుండి ఒకరు నేర్చుకుంటూ ఉండాలి. వివిధ పరిస్థితులను వారు ఎలా దాటుకుంటూ వచ్చారో తెలుసుకుంటూ వారి నుండి స్ఫూర్తి పొందాలి. మనం ఎల్లప్పుడూ నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. ఇది మనకు నెట్వర్కింగ్ అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. 'మహిళలు ఎలా ఎదుగుతారు - స్త్రీలను వెనక్కి నెట్టే 12 అలవాట్లు' అనే ఒక మంచి పుస్తకాన్ని నేను చదివాను. ఒక ఉత్తేజకరమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ప్రస్తుత సంబంధాలను ప్రభావితం చేయడం కంటే కొత్త సంబంధాలను నిర్మించుకోవడంలో ప్రసిద్ధి చెందారు. ఇది నాకు, నాకు తెలిసిన చాలా మంది అనుభవంలో ఉన్నదే.
- సంధ్యా బాలకృష్ణన్
- సలీమ