Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కండ్లకింద చర్మం నల్లగా మారిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. చక్కటి నిద్ర, పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే ఈ సమస్య దరి చేరకుండా కాపాడుకోవచ్చు. అలాగే కొన్ని ఈజీ ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
అల్లం, తులసి, కుంకుమపువ్వుతో టీ తయారు చేయండి. అందులో తగినంత తేనె కలిసి ఆ టీని రోజుకు ఒకసారి తాగండి. ఈ టీలోని ప్రతి పదార్థం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇలా రోజూ ఒక్కసారి టీ తాగడం వల్ల డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గుముఖం పడతాయి.
గుప్పెడు పల్లీలు, కొంచెం బెల్లం, కాస్త కొబ్బరి కలిపి రోజు సాయంత్రం తినాలి. ఇది మీ స్నాక్‌గా అలవాటు చేసుకుంటే నల్లటి వలయాలు కొద్ది రోజుల్లోనే మటుమాయమవుతాయి
శనగపిండి, పాలను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి సబ్బుగా వాడుకోవచ్చు. ఇది వాడేటపుడు ఇతర కెమికల్ సోప్స్ వాడకపోవడం ఉత్తమం.
నిద్రలేమి వల్ల కంటి కింది చర్మం ఉబ్బటంతో పాటు నల్లటి వలయాల సమస్య తలెత్తుతుంది. కాబట్టి రాత్రి 11 గంటల లోపే నిద్రించండి. అతిగా నిద్రపోవడం వల్ల కూడా నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరీ ఎక్కువ సేపు నిద్రపోకండి. టీవీ, మొబైల్ తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల కండ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కూడా మీ కండ్ల చుట్టూ రక్తనాళాలు ఉబ్బి అక్కడి చర్మం నల్లగా మారుతుంది.