Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గేందుకు చలికాలం చాలా అనుకూలమైనదని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. చలి వాతావరణంలో వర్కౌట్స్ చేయడం ద్వారా వివిధ ఉష్ణోగ్రతలను అందిపుచ్చుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందట. తద్వారా క్యాలరీలను కరిగించే సామర్థ్యం పెంపొందుతుందని సెల్ రిపోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం సూచిస్తోంది. ఈ విషయం కనిపెట్టేందుకు యూనివర్సిటీ ఆఫ్ కొపెన్హగెన్కు చెందిన నిపుణులు చలికాలంలో ఈత కొట్టే 8 మందిని ఎంచుకున్నారు. వీరంతా ఈత తర్వాత సౌనా సెషన్‌కు వెళ్లేవారు. మరో బృందంలోని ఈతగాళ్లు వాతావరణ అనుకూలతను ఎంచుకున్నారు. ఈ అధ్యయనం రెండు సంవత్సరాలు సాగింది. చలి వాతావరణంలో ఈతకొట్టిన వాళ్లు వాతావరణంలో చోటుచేసుకునే ఉష్ణోగ్రత మార్పులను బాగా అందిపుచ్చుకున్నట్టు ఈ అధ్యయనంలో గుర్తించారు. అంతే కాదు శరీరం చల్లబడినప్పుడు శరీరరంలో యాక్టివేట్ అయ్యే బ్రౌన్ ఫ్యాట్ (వీరిలో బాగా చురుగ్గా ఉన్నట్టు తేలింది. చలిలో ఉన్నప్పుడు శరీరంలో తగిన ఉష్ణోగ్రత కలిగి ఉండేందుకు ఇది దోహదపడుతుంది. అత్యధిక వేడి ఉత్పత్తి కావడం వల్ల చల్లగా ఉన్న సమయంలో ఈ ఈతగాళ్లలో ఎక్కువ క్యాలరీలు ఖర్చయ్యాయి.
బరువు తగ్గడానికి సహకరించే ఆహారం
క్యారెట్లు: క్యారెట్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి సాయపడటమే కాదు దీన్ని ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ సేపు మీకు కడుపు నిండుగా ఉంటుంది. క్యారెట్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి వాటిని మీరు సాలడ్లు, సూప్స్, స్మూతీల్లో కలిపి తీసుకోవచ్చు.
బీట్రూట్: బీట్రూట్ కూడా ఫైబర్‌తో నిండి ఉంటుంది. వంద గ్రాముల బీట్రూట్లో 43 క్యాలరీలు. 0.2 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల కార్బొహైడ్రేట్లు ఉంటాయి. వీటిని సలాడ్లు, సూప్స్, జ్యూస్, స్మూతీలుగా తీసుకోవచ్చు.
జామకాయ: జామకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీకు రోజు అవసరమయ్యే ఫైబర్‌లో 12 శాతాన్ని ఇవి అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మెటబాలిజం పెంపొందించి బరువు తగ్గడంలో సాయపడతాయి.
జీవనశైలి మార్పులు
ఇన్డోర్ యాక్టివిటీస్ ట్రై చేసేందుకు చలికాలం ఓ గొప్ప అవకాశం. మెట్లు ఎక్కడం కాళ్లకు మంచి వ్యాయామం. డ్యాన్సింగ్, యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటి ద్వారా ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా క్యాలరీలు కరిగించుకోవచ్చు. చక్కని నిద్రతోనూ బరువు తగ్గవచ్చు. చలికాలంలో నిద్ర ఎక్కువ సేపు ఉంటుందని కాబట్టి అది బరువు తగ్గడంలో సాయపడుతుంది.
చలికాలంలో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతారు. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అంతే కాదు ఆకలి పెరిగి, కొవ్వును కరిగించే సామర్థ్యం శరీరంలో తగ్గుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా రక్తప్రసరణ ఉత్తేజితమవుతుంది, బాడీ టెంపరేచర్ మెయింటెయిన్ అవుతుంది. కొవ్వు నిల్వలు కరిగిపోతాయి.