Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిమానీ నౌటియాల్... వన్యప్రాణి పరిశోధకురాలు. 2014లో ఈమె ఉత్తరాఖండ్‌లోని మండల్ వ్యాలీలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. హిమాలయాల్లో నివసించే మహిళా రైతుల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆమె స్ఫూర్తి దాయక కథనం గురించి నేటి మానవిలో...
హిమానీ మండల్ వ్యాలీలో వన్యప్రాణులను, మానవ ప్రవర్తనను దగ్గరగా అర్థం చేసుకుంది. జంతువులను, వాటి పరిసరాలను, వాటి ప్రతిస్పందనను గమనించడం ప్రారంభించింది. పాలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందేందుకు పశువులపై ఆధారపడిన అక్కడి వారి సామాజిక, ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఎంతో కృష్టి చేసింది.
గ్రామాల అభివృద్ధికై...
''అడవి... పశువులకు ప్రధాన దాణా భూమిగా పనిచేస్తుంది. ఇది అడవి నాణ్యతకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా వన్యప్రాణులు తమ ఆహారం కోసం పొలాల వైపు దారి తీస్తున్నాయి. అందుకే నా ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చుట్టూ తిరిగాయి. వన్యప్రాణులు, అడవులు, హిమాలయ కుటుంబ ఆదాయ వనరులను సులభతరం చేయడంపై నా దృష్టి పెట్టాను'' అంటుంది హిమానీ. అటవీ, వన్యప్రాణుల రంగంపై ఆమెకు ఎంతో ఆసక్తి. చివరకు అదే తన వృత్తిగా మారిపోయింది. ప్రస్తుతం హిమానీ మహిళా స్వయం సహాయక బృందం రుద్రనాథ్ మహిళా గ్రామ సంగతన్, ఉత్తరాఖండ్‌కు సహాయం చేయడానికి నిధులు సేకరిస్తోంది.
పితృస్వామ్య వ్యవస్థలో...
ఉత్తరాఖండ్‌లోని హెచ్.ఎన్.బి అగర్వాల్ విశ్వవిద్యాలయం నుండి ఫారెస్ట్రీలో గ్రాడ్యుయేట్ తర్వాత హిమానీ తమిళనాడులోని భారతిదాసన్ విశ్వవిద్యాలయం నుండి వైల్డ్‌లైఫ్ బయాలజీలో ఎమ్మెస్సీ చేసింది. అంతేకాకుండా ఆమె జపాన్ క్యోటో విశ్వవిద్యాలయం నుండి ప్రైమేట్ బిహేవియరల్ ఎకాలజీలో పిహెచ్డి పొందింది. హిమాలయాల్లోని ఓ గ్రామంలో పుట్టి పెరిగిన హిమానీ.. సవాలుతో కూడిన ప్రకృతి అందాల మధ్య జీవితాన్ని బాగా ఇష్టపడింది. వాస్తవానికి పితృస్వామ్య వ్యవస్థ వల్ల స్థానిక మహిళలు నాణ్యమైన విద్యను పొందలేకపోయారు. అటువంటి సమాజంలో ఓ మహిళగా ఒంటరిగా అడవిలో పనిచేయడమంటే హిమానీకి సాధారణమైన విషయం కాదు. ప్రత్యేకించి వన్యప్రాణి పరిశోధకురాలైనప్పటికీ ఆమె సూపర్వైజర్, కుటుంబం మొత్తం కూడా ఎంతో ప్రోత్సహించారు.
కివి సాగు మంచి పరిష్కారం
అక్కడి ప్రజల అభివృద్దికి కివి పండ్ల పెంపకం ఒక మంచి పరిష్కారంగా హిమానీ గుర్తించింది. ఎందుకంటే ఈ పండ్ల పెరుగుదలకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. పైగా కివికి మార్కెట్లో మంచి ధర ఉంది. వన్యప్రాణుల వల్ల పంట దెబ్బతినదు. శ్రమ కూడా చాలా తక్కువ. కివి సాగుపై హిమాని ప్రాజెక్ట్... వన్యప్రాణులను సంరక్షించడంతో పాటు మహిళా రైతులకు స్థిరమైన ఆదాయ వనరును అందించడంపై దృష్టి పెడుతుంది.
లోతుగా అధ్యయనం
''నేను చేయగలిగితే ఇతర గ్రామీణ మహిళలు కూడా చేయగలరు. వారు మన దేశంలోని వేలాది మంది గ్రామీణ మహిళలకు ఆదర్శంగా ఉంటారని నేను నమ్ముతున్నాను'' అంటుంది హిమానీ. గత ఏడు సంవత్సరాలుగా ఆమె తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేస్తోంది. మండల్ లోయలోని మహిళలకు వారి సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు స్ఫూర్తినివ్వడం సహాయం చేయడం ఆమె లక్ష్యం.
నిధుల కోసం...
హిమానీ రూపొందించిన ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ మంజూరుకు సరిపోలేదు. అదుకే నిధుల కోసం హిమానీ ఓ వెబ్సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్‌ను ఆశ్రయించింది. కివి వ్యవసాయం కోసం ఒక్కో నిర్మాణానికి రూ. 50,000, రూ. 60,000 మధ్య ఖర్చు అవుతుంది. ''ఈ సాగు 60 సంవత్సరాల పాటు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ఉత్పత్తి వ్యయాన్ని పెంచే పదార్థం ఇనుము. మేము మద్దతు ఇవ్వడానికి సుమారు 50-60 మంది మహిళా రైతులను లక్ష్యంగా చేసుకున్నాం. అయితే మాకు వచ్చిన నిధుల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండవచ్చు'' అని హిమానీ అంటుంది.
తీవ్ర శ్రమ దోపిడీ
హిమాలయాల్లోని మహిళల ప్రధాన సమస్యలలో ఒకటి తీవ్ర శ్రమ దోపిడీ. కాలుపెట్టేందుకే కష్టంగా ఉండే హిమాలయాల నుండి గడ్డి, కట్టెల సేకరణతో సహా మొత్తం గృహ, వ్యవసాయ పని మొత్తం స్త్రీలే చేస్తారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు తరచుగా వన్యప్రాణులచే నాశనం అవుతున్నప్పటికీ ఈ మహిళలు సాంప్రదాయ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తారు. దీనికి అధిక శ్రమ అవసరం. దానికి తగ్గట్టు ఉత్పత్తి ఉండదు.
శ్రమకు తగ్గ ఫలితం లేదు
మహిళలు తమ శ్రమకు అతి తక్కువ ప్రతిఫలాన్ని అందుకుంటారు. సరైన ఆర్థిక మద్దతును పొందరు. పైగా మన దేశంలో పురుషుల మాదిరిగా మహిళలను రైతులుగా గుర్తించబడలేదు. తద్వారా మహిళలకు భూమిపై హక్కు లేదు. పురుషుల వలె వీరికి రుణాలు, యంత్రాలు దొరకవు. వ్యాపారాలను సహకరించి ప్రారంభించడానికి ఆర్థిక పునాది, ప్రజలు, వన్యప్రాణుల మధ్య శాంతియుత సహజీవనం తీసుకురావడానికి వారికి సహాయపడుతుంది. నిజానికి ఈ మహిళా రైతులను సేంద్రీయంగా ప్రారంభించడానికి హిమానీ సేకరించిన మొత్తం నిధులను పెట్టుబడి పెట్టింది.
ఎందరో కలిసొచ్చారు
హిమానీ 2014లో స్వతంత్ర పరిశోధకురాలిగా తన పనిని ప్రారంభమైనప్పటికీ మరుసటి ఏడాదిలో యుకె లోని రఫోర్డ్ గ్రాంట్ నుండి గ్రాంట్ లభించింది. గ్రామం నుండి ఓ సహాయకురాలిని నియమించుకుంది. ఆమెకు వన్యప్రాణులు, వాటి ప్రవర్తన గురించి శిక్షణ ఇచ్చింది. చివరికి గ్రామానికి చెందిన మరికొందరు మహిళలు ఆమెతో కలిసి ఆమె ప్రయాణం పట్ల ఆసక్తిని కనబరిచారు. రోజులు గడిచేకొద్దీ ఆమె స్థానిక మహిళా రైతులకు శిక్షణ ఇవ్వడానికి దేశ, విదేశాల నుండి వాలంటీర్లను రప్పించింది.
సుస్థిరమైన ఆదాయ వనరుగా...
ప్రస్తుతం హిమానీ బృందంలో దాదాపు 60 మంది వాలంటీర్లు, మరి కొంతమంది స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఆమె తన పరిశోధనా బృందంలో భాగంగా వారి మాస్టర్స్ కోసం స్టూడెంట్ ఇంటర్న్‌లను కూడా కలిగి ఉంది. రాబోయే మూడు, నాలుగేండ్లలో హిమానీ కివీ వ్యవసాయాన్ని అందరికీ స్థిరమైన ఆదాయ వనరుగా మార్చాలని యోచిస్తోంది. మహిళా రైతులు, మండల్ లోయను కివీ వ్యవసాయ ప్రాంతంగా అభివృద్ధి చేస్తుంది.
డాక్యుమెంటరీ చేస్తాను
ఇది మహిళలందరికీ వ్యవసాయ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది సురక్షితమైన ఎంపిక కూడా. అడవి జంతువుల నుండి పంటలను కాపాడండి. అభివృద్ధికి పాటుపడండి. దీనిపై నేను ఓ డాక్యుమెంటరీని కూడా రికార్డ్ చేయాలనుకుంటున్నాను. ఈ డాక్యుమెంటరీలో మహిళా రైతుల విజయగాథలను చిత్రీకరిస్తాను. ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
నాపై నమ్మకం కలిగేలా...
''నేను మొదటి సారి మండల్ లోయకు వెళ్ళినప్పుడు ప్రజలు ఎంతో ఆదరించారు. సమయం గడిచేకొద్దీ నేను వన్యప్రాణులను ఆదుకోవడమే కాకుండా గ్రామ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ప్రజలకు అర్థం చేయించడం కష్టంగా మారింది. నా పనిపై వారికి నమ్మకం కలిగించడం, వన్యప్రాణులు, మానవులు రెండింటినీ సమానంగా చూడటం చాలా ముఖ్యమైనది''
- సలీమ