Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజులో టీని రెండు కప్పులకంటే ఎక్కువగా తాగితే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 12 ఏండ్లలోపు పిల్లలు టీ అస్సలు తాగకూడదు. ఇందులో ఉండే కెఫిన్ వారి శరీరానికి హాని కల్గిస్తుంది. అలాగే శరీరంలోని పోషకాలను నాశనం చేస్తుంది.
అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ, టీలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఒక కప్పు టీలో కప్పు కాఫీలో ఉండే కెఫీన్ కంటే మూడో వంతు తక్కువగా ఉంటుంది. అయితే టీని ఎక్కువగా తీసుకోవడం వలన అలసట, గుండె వేగం పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు కలిగిస్తుంది.
టీలో ప్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఇది ఎక్కువ మొత్తంలో వెళితే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. తొందరగా ఎముకలు అరిగిపోతాయి. అలాగే రోజులో ఐదు కప్పుల కంటే ఎక్కువగా టీ తాగితే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్ల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అమ్మాయిలు టీ ఎక్కువగా తాగితే పొత్తి కడుపులో నొప్పి కలుగుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా కడుపులో యాసిడిటి పెరుగుతుంది. గర్భిణీలు టీ తాగకూడదు. టీ ఎక్కువగా తాగితే ఐరన్ లోపం కలుగుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు మాంసాహారం లేని ఆహార పదార్థాల నుంచి శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటాయి.