Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిజీ లైఫ్ కారణంగా వేళకు ఎవరూ సరిగా తినడం లేదు. ఒకవేళ తిన్నా కూడా ఏదో అరకోర తినేసి పనిచేస్తున్నారు. పని పట్ల నిబద్దత కావచ్చు.. ఒత్తిడీ కావచ్చు. ఇక వేళకు తినకుండానే నిద్రకు ఉపక్రమిస్తున్నారు ఇప్పటి జనం. దీంతో అర్ధరాత్రి వేళ ఆకలి సమస్యతో బాధపడుతున్నారు. మరోవైపు చాలామంది బరువుని కరెక్టుగా ఉంచుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైటింగ్ పేరుతో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డైటింగ్ పేరుతో పొట్ట మాడ్చుకోవడం లాంటివి చేస్తున్నారు. ఎంత ఆకలి వేసినప్పటికీ కేవలం కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ వుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే మరింత మితంగా ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో నిద్ర సమస్యలూ తలెత్తుతున్నాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
రాత్రిళ్లు ఏం తినాలి అనేది చాలా మందికి అర్థం కాదు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం రాత్రిళ్లు భుజించాలి.
ఉప్పు, చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీ నిద్రకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
రాత్రిళ్లు కండరాలు, ఇతర టిష్యూలు రిపేర్ చేసుకునే మోడ్‌లోకి జారుకుంటాయి. అలాగే శరీరం కూడా పలు క్రియలను నిద్రలో జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంది. అందుకే నిద్ర సరిగ్గా పట్టేందుకు ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు ఆహారంలో పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి.
విటమిన్ బి6, ట్రైటోఫాన్, అలాగే కొన్ని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి.