Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్న దీపావళి పండుగ రానే వచ్చింది. అయితే.. ఈ వెలుగులు నింపే పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో అనేక మంది గాయాలు పాలవడం, మరి కొందరు చనిపోవడం లాంటి విషాధ సంఘటనలు ప్రతీ ఏడాది వింటూనే ఉంటాం. అయితే ఈ సారి అలాంటి దురదృష్టకరమైన ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి
బాణాసంచా పేల్చేటప్పుడు స్నేహితులతో పందెం కాయడం పోటీలు పడడం చేయకండి. ఇలాంటివి ప్రమాదకరమైనవి.
దీపావళి సందర్భంగా అందరూ కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇతర దుస్తుల కన్నా కూడా ఈ పండుగకు కాటన్ బట్టలు ధరించడం మంచిది.
ఇంటి లోపల బాణాసంచాను అస్సలు కాల్చకండి. దీని వల్ల భారీగా ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బాణసంచా ఏదైనా మైదానం లేదా ఇంటి ముందు ఖాళీ స్థలంలో కాల్చండి.
బాణాసంచా కాల్చే ప్రదేశంలో బకెట్లోలో నీటిలో అందుబాటులో ఉంచుకోండి. తద్వారా మంటలు చెలరేగితే వెంటనే ఆర్పివేయవచ్చు. అధిక శబ్ధాలు వచ్చే బాణాసంచాను కాల్చే సమయంలో చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి.
దీపావళి బాణాసంచా పేల్చేటప్పుడు మనం బ్యాండ్ ఎయిడ్స్, యాంటీసెప్టిక్ లోషన్లు, గాయం మందులను అందుబాటులో ఉంచుకోవాలి. దీని వల్ల ఎవరైనా గాయపడితే, వారికి అవసరమైన మందులతో త్వరగా ప్రథమ చికిత్స చేయవచ్చు.
ఇది చాలా సంతోషకరమైన పండుగ. ఈ సమయంలో మనం చేసే చిన్న తప్పు పెద్ద తప్పుకు దారి తీస్తుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటించండి. పండుగను ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోండి.