Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమృత దేశ్‌పాండే... 32 ఏండ్ల ఈ యువతి విదర్భలోని పిల్లలు, యువతలో ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేస్తున్నది. నిత్యం కరువుతో అల్లాడుతూ, అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఆ ప్రాంతంలోని యువతకు ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పిస్తుంది. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనపుడు ఎలా తట్టుకోవాలో పాఠాలు చెబుతుంది. అవేంటో మనం కూడా తెలుసుకుందాం...
అమృత దేశ్‌పాండే... విదర్భ అంతటా పాఠశాలలకు వెళ్లి పొదుపు ప్రాముఖ్యతపై పిల్లలకు అవగాహన కల్పిస్తుంది. గత మూడు నెలలుగా ఆమె అక్కడి యువకులలో ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేయడానికి ఆ ప్రాంతమంతటా పర్యటిస్తున్నది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నిత్యం కరువుతో అల్లాడుతుంటుంది. రైతులు అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి చోట యువకులలో, పిల్లల్లో పొదుపుపై అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా పెట్టుకుంది అమృత. తద్వారా ఆ కుటుంబాలు కష్ట పరిస్థితులలో మెరుగైన జీవితాన్ని గడపవచ్చని ఆమె నమ్మకం.
లాక్డౌన్ సమయంలో...
ఆర్థిక విషయాలపై కొంత అవగాహన ఉన్న అమృత మార్చి 2020లో లాక్డౌన్ ప్రకటించినప్పుడు తన సొంగ ఊరైన నాగ్‌పూర్‌కి తిరిగి వచ్చింది ''లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్ళేందుకు అవకాశం లేదు. ఇంటి నుండి పని చేయలేకపోయాను. దాంతో ఆ ఖాళీ సమయంలో రెండు పుస్తకాలు రాయడం ప్రారంభించాను. నేను రాసిన ఒక పుస్తకం బ్యాంకింగ్ ఆఫ్ బేసిక్స్. ఇది చిన్న పిల్లలకు బ్యాంకింగ్, పొదుపులను పరిచయం చేసింది. అయితే సేవింగ్, బ్యాంకింగ్ పరిచయం కళాశాల విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడుతుంది'' అని అమృత చెప్పారు.
అన్నింటిపై సమాచారం
బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్... ఇంగ్లీషు, మరాఠీ రెండు భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది. అలాగే స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ ద్వారా పిల్లలకు పొదుపులను పరిచయం చేస్తుంది. ఇది ఆర్బిఐ, బ్యాంకింగ్ చరిత్ర, బ్యాంక్ సౌకర్యాలు, ఏటీఎం ఉపయోగాలు, పిల్లల కోసం పథకాలు... ఇలా అన్నింటిపై సమాచారాన్ని అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎలా సంపాదించాలో తెలిసిన తెలివైన పిల్లలకు కొరత లేదని అమృత అంటుంది. అయితే పొదుపుపైనే పెద్దగా అవగాహన లేదని ఆమె అంటుంది.
తర్వాతి అవసరాలకు...
''నేను చాలా మంది తెలివైన అబ్బాయిలు, అమ్మాయిలను చూశాను. కానీ వారి ఏకైక లక్ష్యం ఓ ప్రయోజనం కోసం త్వరగా డబ్బు సంపాదించడం. ఉదాహరణకు ఫోన్ కొనడానికి సరిపడా సంపాదిస్తారు. దాని వరకు సంపాదించుకుంటే చాలు.. తర్వాత అవసరాలు తీర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పనికి వెళ్ళడం లేదు' అంటున్నది అమృత.
చిన్నవయసులోనే...
మూడు నెలల కిందట ఆమె రీజియన్‌లోని పాఠశాలలతో మాట్లాడి, వెనుకబడిన వారికి ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేయడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అమృత ఇప్పటివరకు 65 పాఠశాలలను సందర్శించి 7,000 మంది విద్యార్థులతో సంభాషించింది. ఇది కళాశాల విద్యార్థులు, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వారి కోసం ఆమె ఆఫ్‌లైన్ తరగతులు తీసుకుంది. అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా ఎన్నో తీసుకుంది.
భవిష్యత్ కోసం పొదుపు
''మొదటి 5-10 నిమిషాలు నేను పాల్గొనేవారి వయసును బట్టి పొదుపుపై మాట్లాడతాను. వారు 5వ తరగతి కంటే తక్కువ ఉన్నట్టయితే భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎందుకు ప్రయోజనకరమో వారికి బోధించే కథలను వారికి చెబుతాను. ఆ తర్వాత వాటిని కెవైసీ ద్వారా తీసుకుంటాను. యుటిలిటీల చెల్లింపు, రైలు టిక్కెట్లను బుక్ చేయడం, నగదు డిపాజిట్ చేయడం, బీమా ప్రీమియంలు చెల్లించడం వంటి నగదు ఉపసంహరణ కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఆర్థిక వ్యవస్థను ఎలా ఉపయోగించవచ్చో వారికి తెలియజేస్తాను.
పిల్లల ద్వారా...
అక్కడితో ఆమె ప్రయత్నం ఆపలేదు. అపెక్స్ బ్యాంక్‌గా ఆర్బిఐ పాత్ర గురించి, బ్యాంక్ టెల్లర్లు, లాకర్ సిస్టమ్, నాణేలు ముద్రించబడిన చోట నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో.. ఇలా మరిన్నింటిపై వారికి అవగాహన కల్పిస్తుంది. చివరికి పిల్లలు పొదుపు, బ్యాంకింగ్ వ్యవస్థ రెండింటిపై సమగ్ర జ్ఞానంతో పొందుతారు. ''వారి ద్వారా వారి తల్లిదండ్రులను కూడా చదివించాలనే ఆలోచన ఉంది. ఉదాహరణకు 4వ తరగతి విద్యార్థి పాఠశాల బ్యాంకులో రూ.5,000 పెట్టుబడి పెట్టాడు. ఆమె తల్లి కోవిడ్‌తో వచ్చినప్పుడు ఆ డబ్బును మంచి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఉపయోగించింది'' అని ఆమె చెప్పింది.
ఆదాయంపై స్థిరమైన వడ్డీ కోసం
''స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి నేను కచ్చితంగా వ్యతిరేకం. ఎందుకంటే ఈ వ్యక్తుల వద్ద మిగులు డబ్బు లేదు. వారి ఆదాయంపై స్థిరమైన వడ్డీకి హామీ ఇచ్చే అనేక పోస్ట్-ఆఫీస్ పథకాలు, ఆర్బిఐ బాండ్లు, ప్రభుత్వం అందించే ఇతర పొదుపు పథకాలు ఉన్నాయి'' అంటుంది ఆమె. అమృత ఇంటరాక్టివ్ సెషన్లకు మంచి స్పందన లభించింది. పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సహకారం అందిస్తే...
ప్రస్తుతం అమృత ఒంటరిగానే తన కృషిని కొనసాగిస్తుంది. ప్రయాణాలకు ఇతర ఖర్చులకు తన సొంత డబ్బునే ఖర్చు చేస్తుంది. అయితే ఈ చొరవను మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి ఆమె ప్రయత్నిస్తుంది. దానికోసం ఎవరైనా సహకారం అందిస్తే స్వీకరించేందుకు ఆమె సిద్ధంగా ఉంది. ''నేను వికలాంగ పిల్లలకు తరగతులు నిర్వహించేందుకు బ్రెయిలీ లేదా ఆడియో ఫార్మాట్లో పుస్తకాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నా తదుపరి దశ కళాశాల విద్యార్థులకు వార్షిక బడ్జెట్‌ను ఎలా చదవాలో, అర్థం చేసుకోవడం నేర్పడం. అదే సమయంలో నేను కూడా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను'' అని అమృత చెప్పింది.
మహిళలపై భారం
ఆర్థిక అక్షరాస్యత అనేది మగవారు మద్యపానానికి బానిసలైన కుటుంబాలకు చాలా అవసరమైనది. ఇంట్లో మగవారు మద్యానికి బానిసలైనపుడు ఆ ఇంటి భారమంతా మహిళలు, పిల్లలపైనే పడుతుంది. తరచుగా పిల్లల స్కూల్ స్కాలర్షిప్ డబ్బును కూడా వారి తండ్రులు స్వాహా చేసి తాగుతుంటారు. ''ఆర్థిక సమాచారం కోసం వారికి ఎటువంటి మూలాధారం లేనందున, ఈ సెషన్లు పిల్లలు తెలివిగా పొదుపు చేయడంలో సహాయపడతాయి'' అంటూ అమృత జతచేస్తుంది.
- సలీమ