Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర కప్పు ద్రాక్ష పండ్ల గుజ్జుకు, టేబుల్ స్పూన్ యాపిల్ గుజ్జు, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, పావు కప్పు గుడ్డులోని తెల్ల సొనను కలపాలి. దీన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మతత్వానికి మంచిగా పని చేస్తుంది.
అప్పుడప్పుడు ఐస్ క్యూబ్‌ని కూడా ముఖానికి రాయడం వల్ల ముఖం స్మూత్‌గా మారుతుంది.
గింజలు లేని టొమాటోలను కూడా ముఖానికి ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులను పాటిస్తే ఎంతటి పొడి చర్మం అయిన తిరిగి తాజాదనాన్ని అందుకొని, నునుపుగా అందంగా తయారవుతుంది.
లావెండర్ ఆయిల్ చాలా మంచిది. లావెండర్ ఆయిల్ సన్ బర్న్, రెడ్ నెస్ మొదలైన సమస్యలని తరిమి కొడుతుంది కాబట్టి బాడీ బటర్ని ఉపయోగించేటప్పుడు అందులో లావెండర్ ఆయిల్ ఉన్న వాటిని ఉపయోగించండి. చర్మ సమస్యలు కూడా మీ దరిచేరవు. దీని వల్ల చర్మం పొడి బారదు.