Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, నిద్ర లేమి మనుషులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించడం ముఖ్యం. లేక పోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం ఉత్తమం. కాబట్టి ఏ ఆహారాలు మీ జ్ఞాపకశక్తిని పెంచుతాయన్న సమాచారం మీకోసం..
బ్లూబెర్రీస్: బ్లూబెర్రీస్‌లో అత్యధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. బెర్రీలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అవి గ్లూటెన్-రహితంగా ఉంటాయి. మెదడులో సిగలింగ్ను మెరుగుపరుస్తాయి.
గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలు మీ జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ గుమ్మడి గింజలు మానవ జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతమైన ఆహారం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, నిరాశను తగ్గిస్తుంది.
కాఫీ: దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని పెంచే పానీయం కాఫీ. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కెఫీన్లో ఒకటి, రెండు కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వాల్నట్స్: వాల్నట్స్ తినడం వల్ల ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది. ఇది ఒక రకమైన డ్రై ఫ్రూట్. ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడానికి ప్రతిరోజూ తినవచ్చు. వాల్ నట్స్ జ్ఞాపకశక్తిని పెంచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి.