Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి స్త్రీ ఆరోగ్యకరమైన బిడ్డను కనాలని కోరుకుంటుంది. దీనికోసం తెలుసుకోవాల్సిన కొన్ని చిట్కాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం...
- గర్భధారణ సమయంలో శరీరం ఎలాంటి మార్పులకు లోనవుతుందో తెలుసుకోవాలి. ఏమి తినాలి. ఏమి తినకూడదు. ఏవి చేయకూడదు. చేయాలి అని మీరే తెలుసుకోవాలి. సంతోషంగా ఉండటానికి మార్గాలు, ఆరోగ్యకరమైన శిశువు ఎదుగుదలకు దోహదపడే అంశాలు. ప్రసవం తర్వాత మిమ్మల్ని, మీ బిడ్డను ఎలా చూసుకోవాలి. తల్లిపాలు ఇవ్వడం గురించి తెలుసుకోవాలి.
సాధారణ మహిళలతో పోలిస్తే.. గర్భిణీలు బరువు పెరగాలి. కానీ,అధిక బరువు కూడా మంచిది కాదు. దీనివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో 10-12 కిలోల బరువు పెరగాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం పిల్లల ఆరోగ్యానికి మంచిది.
తాజా పండ్లు, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యమైనవి. రోజూ 8-10 గ్లాసులు నీరు తాగాలి. 2వ మాసంలో 350 అదనపు కేలరీలు, 3వ నెలలో 450 అదనపు కేలరీలు తినాలి. కాల్షియం మాత్రమే తినండి.
వైద్యులు సూచించిన విధంగా నడవడం, వ్యాయామం చేయడం, స్విమ్మింగ్ వల్ల ప్రెగెన్సీ సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. అలాగే తిమ్మిరి, అధిక రక్తపోటు, డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శిశువు సరైన పెరుగుదలకు తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. రాత్రిపూట 6 - 8 గంటల నిద్ర, పగటిపూట రెండు గంటల నిద్ర అవసరం. ఇది పెరుగుతున్న శిశువుకు తగినంత ప్రసరణను అందిస్తుంది.
గర్భం దాల్చిన 28 వారాల నుంచి పిండంలో శిశువు కదలికను తనిఖీ చేయాలి. రోజుకు కనీసం 10 - 12 సార్లు బేబీ కదలిక ఉండాలి. ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.