Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, మెరవడానికి విటమిన్ బి దోహదపడుతుంది. విటమిన్ బిలో బయోటిన్, నియాసిన్ ఉంటాయి. జుట్టు రాలకుండా బయోటిన్ సప్లిమెంట్లు కూడా ఉపయోగపడతాయని హార్వార్డ్ హెల్త్ నిపుణులు తెలిపారు. కోడి గుడ్డులో ఇవి పుష్కలంగా లభిస్తాయి.
ఒక గుడ్డు, అరకప్పు శనగల్లో ఆరు గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఒక ముక్క చికెన్ లేదా ఒక చేప ముక్కలో 30 గ్రాముల ప్రోటీన్స్‌తో పాటు అమినో ఆసిడ్లు లభిస్తాయి. పౌల్ట్రీ ఉత్పత్తులతో పాటుమాంసం, చేపలు, శనగలు, పప్పు, ఓట్స్, బీన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని హార్వార్డ్ నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ల సూచనల మేరకు ప్రోటీన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చని వారు సూచించారు.
కొందరు సగం ఉడికించిన గుడ్డు తింటూ ఉంటారు. అలా చేయవద్దని పూర్తిగా ఉడికించిన గుడ్డు మాత్రమే తినాలని హార్వార్డ్ నిపుణులు తెలిపారు. కోడి గుడ్లు, మాసం, విత్తనాలు, గింజలు, తీపి ఆలూ, బ్రోకోలిలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యం పెరుగుతుందని హార్వార్డ్ నిపుణులు పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన జుట్టుకు సూర్యరశ్మి దోహదపడుతుంది. జుట్టులోని ఫోలీసెల్స్ చక్కగా పనిచేసేందుకు విటమిన్ డి చాలా ముఖ్యం. టెక్నికల్‌గా విటమిన్ డి అనేది విటమిన్ కాదని హార్వార్డ్ హెల్త్ అభిప్రాయపడింది. శరీరంలోనే విటమిన్ డి తయారవుతుంది.
కేవలం చేపల్లోనే కాకుండాగుడ్డు సొనలో కూడా విటమిన్ డిపుష్కలంగా లభిస్తుంది. సూర్యరశ్మి ద్వారా శరీరంలోకి విటమిన్ డి3 చేరుతుంది. అది తరవాత లివర్, కిడ్నీలకు చేరడం ద్వారా విటమిన్ డి గా రూపాంతరం చెందుతుంది. పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్లో సైతం విటమిన్ డి పుష్కలంగా లభిస్తుందని హార్వార్డ్ హెల్త్ స్పష్టం చేసింది.