Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం శరీరం తేమను త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి చర్మాన్ని కాపాడుకోవడమే సవాలు. ముఖ్యంగా పొడి చర్మంవారు ఈ కాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
నీరు తాగాలి: చలికాలం శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. దీన్ని నివారించడానికి తరచూ నీరు తాగాలి. కనీసం రోజుకు 8 గ్లాసుల నీరు తాగడం మంచిది. దీనివల్ల డ్రై స్కిన్ కూడా నివారించవచ్చు.
ఆహారం: కొవ్వు పదార్థాలను తినాలి. మాయిశ్చరైజర్‌గా పనిచేసే ఈ ఫుడ్ చర్మాన్ని పునరురద్దరించడంలో సహాయపడుతుంది.
వేడినీటి స్నానం: వేడి నీరు చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. చర్మం నీర్జివంగా తయారవుతుంది. కాబట్టి గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
రసాయనాలు: చలికాలంలో కెమికల్స్ అధికంగా ఉండే చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకూడదు. బదులుగా సహజమైన ఇంటి చిట్కాలను అనుసరించండి. ముఖ్యంగా కాక్టస్ జెల్ వాడితే పొడి చర్మ సమస్య పోతుంది. డ్రై స్కిన్ వారు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ వాడాలి.