Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుకుల పరుగుల జీవితం.. ఒత్తిడితో కూడిన ఉద్యోగం.. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు... ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి, పడుకోవడానికి, నిద్ర లేవడానికి కూడా ఓ సమయం సందర్భం అంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ నేటి రోజుల్లో మాత్రం సమయం అంటూ ఏదీ లేదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం.. ఇక ఇష్టం వచ్చినప్పుడు లేవడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఎంతో మందిపై ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో యువత పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏది అంటే నిద్రలేమి అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది పడుకున్నప్పటికీ నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సుఖనిద్రను పొందవచ్చు. అవేమిటంటే...
నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్ వాడకానికి ఎంతో దూరంగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం ద్వారా మంచి నిద్ర లభిస్తుందని చెబుతున్నారు.
పడుకునే ముందు ఓ గ్లాసు వేడి పాలు తాగడం ద్వారా కూడా త్వరగా నిద్ర రావడానికి అవకాశం ఉంటుందట.
రాత్రి సమయంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. పడుకునే ముందు ఇలా స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుంది.
- నిద్ర ప్రశాంతంగా పట్టాలంటే టీ, కాఫీ లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
రాత్రి సమయంలో మితంగా మాత్రమే ఆహారం తీసుకోవాలని.
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకునేలా సమయపాలన పాటించడంతో పాటు పడుకునే ముందు ఎలాంటి విషయాలను అతిగా ఆలోచించొద్దు అంటూ చెబుతున్నారు నిపుణులు.