Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ అందం, ఆరోగ్యానికి మంచి నీళ్లే కారణమని చెబుతుంటారు. అయితే ఎంత తాగాలో అంతే తాగాలి. ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి హానికరం. నీరు అతిగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..? మంచి నీరు అతిగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది మంచిది కాదు. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
నీరు ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది.
శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అంతేకాదు రక్తం పెరగడం కారణంగా రక్తనాళాలు, గుండెపై అదనపు భారం పడుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తాయి.
నీరు మరీ ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా మూత్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం స్థాయి తగ్గి మరణానికి దారి తీస్తుంది.
అతిగా నీరు తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.