Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో సహజంగానే చాలామందికి చర్మం పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగిలిన చర్మానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు రాస్తూ ఉంటారు. మరికొంతమంది కొబ్బరినూనె రాసుకుంటూ ఉంటారు. వీటితోపాటు కొన్ని ఆహార పదార్థాలను కూడా ప్రతిరోజు తీసుకోవాలి. దాంతో చర్మం పగలకుండా ఉంటుంది. అలాగే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మరి చర్మ సంరక్షణకు ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
దానిమ్మ: ఈ పండ్లను చూడగానే ప్రతి ఒక్కరికి తినాలనే ఆశ పుడుతుంది. దీని గింజలు ఎర్రగా నిగనిగ లాడుతూ భలే ఉంటాయి. దానిమ్మ పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చర్మం ఎప్పుడూ తేమగా, మృదువుగా ఉంటుంది. అలాగే చర్మానికి చక్కని వన్నెతో పాటు టోన్‌ను అందిస్తుంది. వీటిలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఫలితంగా చర్మం పగలకుండా ఉంటుంది.
గోబి ఆకులతో: ఏ భాగంలో నల్లగా ఉంటుందో ఆ భాగంలో గోబి ఆకుల పేస్ట్‌ను పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు రోజులు చేయడం మంచిది.
పెరుగు: చర్మాన్ని శుద్ధి చేయడానికి పెరుగు బాగా సహాయపడుతుంది. శరీరంలో ఏ భాగం నల్లబడిందో ఆ భాగంలో పెరుగు తీసుకొని బాగా మర్దన చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేయడంవల్ల ఫలితాలు ఉంటాయి