Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి జీవనశైలి కారణంగా వ్యక్తి వయసు తగ్గుతోంది. చెడు ఆహారపు అలవాట్లు మన జీవితకాలాన్ని ప్రభావితం చేస్తాయని అనేక అధ్యయనాలలో రుజువైంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకుంటే కచ్చితంగా ఎక్కువ కాలం జీవిస్తారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త , ఆరోగ్య , పోషకాహార నిపుణుడు డాక్టర్ జేమ్స్ డినికోలాంటినియో ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అలాంటి కొన్ని ఆహార పదార్థాల గురించి చెప్పారు. అవేంటో తెలుసుకుందాం..
తేనె: తేనెలో ఉండే పోషకాలు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ హెల్త్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, కాలేయం, కొలొరెక్టల్, రొమ్ము క్యాన్సర్లపై తేనె చూపే ప్రభావం గమనించబడింది. అధ్యయనం ప్రకారం తేనె కణితులు, క్యాన్సర్ వంటి కణాలకు అత్యంత సైటోటాక్సిక్... సాధారణ కణాలకు నాన్-సైటోటాక్సిక్.
దానిమ్మ: దానిమ్మపండు ఏ, సి, ఇవిటమిన్లతో పాటు అనేక రకాల ఖనిజాలకు మంచి మూలంగా పరిగణించబడుతుంది. యాంటీ వైరల్, యాంటీ ట్యూమర్ గుణాలు కూడా దానిమ్మలో ఉన్నాయి. నేచర్ మెడిసిన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం దానిమ్మలోని మైటోకాండ్రియా కండరాలు బలహీనపరచకుండా చూస్తుంది. మరొక అధ్యయనం ప్రకారం మైటోకాండ్రియా పనిచేయకపోవడం పార్కిన్సన్స్ వంటి వృద్ధాప్య వ్యాధులను ప్రేరేపించడానికి పని చేస్తుంది.
పచ్చి అరటిపండు: మన పొట్టలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందించే పచ్చి అరటిపండులో ఒక రకమైన ప్రీబయోటిక్ ఉందంట. ఇది రక్తపోటును కూడా తక్కువగా ఉంచుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం పచ్చి అరటిపండు తినడం వల్ల కిడ్నీ క్యాన్సర్ రిస్క్ 50 శాతం తగ్గుతుంది.