Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణంలో కాలుష్యం, మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం వంటి కారణాలవల్ల ప్రతి ఒక్కరికి జుట్టురాలడం అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎంతో డబ్బులు కూడా ఖర్చు చేసి విసుగు చెంది ఉంటారు చాలామంది. మరి సహజంగా జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఊడిపోకుండా ఉండాలన్నా ఏం చేయాలో తెలుసుకుందాం...
నువ్వులు, బచ్చలి కూర, మెంతి కూర వంటివి తీసుకుంటే జుట్టుకి చాలా మేలు చేస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. ఒత్తుగా పెరిగే జుట్టు కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి. దానితో పాటు రోజూ వ్యాయామం చేయడం కూడా ప్రయోజనాలని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా చెయ్యడం వలన మీ జుట్టుని అందంగా మార్చుకోవడానికి వీలు అవుతుంది.
తలకి పట్టించే నూనెలో వేప, కరివేపాకు, మందారం వంటివి ఉపయోగించడం చాలా మంచిది. పైగా వీటి వలన ఎలాంటి జుట్టు సమస్య కూడా వుండదు. హెయిర్ ఆయిల్స్‌తో తలని బాగా మసాజ్ చేస్తూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉండి బాగా ఒత్తుగా పెరుగుతుంది.
రోజూ కొబ్బరి నూనెనే వాడాలి. దీని వల్ల తలలో వేడి బాగా తగ్గి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తల స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరిపోవడానికి హెయిర్ డ్రయర్ వాడకండి. జుట్టు నాచురల్‌గా ఆరిపోయే విధంగా ట్రై చెయ్యండి. డ్రయర్ వలన జుట్టు ఊడిపోయే ప్రమాదం వుంది.