Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను నివారించడానికి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి చేతులు, కాళ్లు ముఖ్యంగా పాదాలు చల్లగా ఉంటాయి. శరీరంలో రక్తప్రసరణ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కొంతమందిలో కనిపిస్తుంది. చలికాలంలో ఇది సహజం. కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టేస్తే రోజువారీ పనులు చేసుకోవడం కష్టం. అందుకే ఈ సీజన్లో వెచ్చగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం.
వెచ్చని దుస్తులు: చలికాలంలో చేతులు కాళ్లు చల్లగా ఉంటే ఎల్లప్పుడూ ఫుల్ స్లీవ్లు, ఫుల్ ప్యాంట్లు ధరించాలి. బయటకు వెళ్లినప్పుడు కాళ్లకు, చేతులకు సాక్స్ ధరించాలి. అదనంగా టర్టిల్నెక్ నెక్లైన్ను ధరించాలి. అది దుస్తులు పైన మెడ వరకు లాగవచ్చు. ఉన్ని బట్టలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. చలికాలంలో ఉన్ని బట్టలు వెచ్చగా ఉండటానికి, శరీరంలో అన్ని భాగాలకు సమాన రక్త ప్రసరణను కలిగి ఉండటానికి సహాయపడతాయి.
ప్రతిరోజూ వ్యాయామం: రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలు శరీరమంతా సమతుల్యంగా ఉంటాయి. రోజూ ఉదయం కాసేపు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. చలి నుంచి మిమ్మల్ని మీరు సులభంగా రక్షించుకోవచ్చు.
వేడినీళ్లు: కాల్షియం శరీరంలోని వేడిని శరీరం లోపల లాక్ చేసే గుణం కలిగి ఉంటుంది. శారీరక నొప్పి, వాపు శారీరక అలసట ఉన్నట్టయితే రాళ్ల ఉప్పుతో స్నాన ం చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేయాలి. కాళ్ల నరాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ పెరుగుతుంది.
హాట్ ఆయిల్: మీ శరీరాన్ని వేడి లేదా గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల అధిక చలి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆయిల్ మసాజ్ మీ చేతులు, కాలితో సహా శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు, శరీరంలోని అన్ని భాగాలకు సరిపడా ఆక్సిజన్ అందజేస్తుంది.