Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలను సమన్వయం చేసుకోవడం కత్తిమీద సామే. అవన్నీ చక్కగా సాగిపోవాలంటే ఆర్గనైజ్డ్గా ఉండటం ఒక్కటే మార్గమంటారు కెరియర్ నిపుణులు. అందుకోసం ఏం చేయాలంటే...
అన్నీ పనులూ పక్కాగా పూర్తవ్వాలంటే... సమయపాలన ఒక్కటే ఉంటే సరిపోదు. వాటిని నెరవేర్చడానికి మన శక్తి సామర్థ్యాలు ఎంత మేర పనిచేస్తాయో గమనించుకోవడమూ ముఖ్యమే. ఎందుకంటే ఎప్పుడు.. ఎక్కడ.. ఎంత మోతాదులో ఉపయోగించాలో అర్థమ వుతుంది. అప్పుడే కీలకమైన పనుల్ని సకాలంలో పూర్తి చేయగలం.
చాలామంది మహిళలు... ఒత్తిడికి గురవడానికి ప్రధాన కారణం మల్టీటాస్కింగే. అన్ని పనులూ ఒకేసారి చేయాలనుకోవడం, అన్నీ తామే చేయాలనుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తిచేయగలిగితే... పని విషయంలో మీరు పక్కాగా ఉండొచ్చు.
పనులు పూర్తిచేయడంలో వెనుకబడుతుంటే ఇతరుల సాయం తీసుకోవడానికి వెనుకాడకండి. అలానే...ఎప్పటి పని అప్పుడే అయ్యేట్లుగా చూసుకోవడమూ అవసరమే. అందుకే వ్యక్తిగత, ఆర్థిక విషయాల్లోలాగానే... ప్రణాళికను అమలు చేయడంలోనూ క్రమశిక్షణ పాటించాలి.