Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు. ముఖంపై నల్లటి మచ్చలు ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు వాడి వాటిని కనిపంచకుండా చేసినా అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే కనిపిస్తాయి. దాచితే దాగినవి మచ్చలు. చాలా మంది ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. కొందరు ఈ మచ్చల వల్ల మానసికంగా కుంగిపోతుంటారు. మచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. చర్మం యవ్వనంగా, తాజాగా కనిపించడం అనేది మంచి ఆరోగ్యానికి సంకేతమని చెప్పాలి. చర్మ సంరక్షణ కోసం కచ్చితంగా కొన్ని పద్దతులని పాటించాలి. మాయిశ్చరైజింగ్ ఇంకా టోనింగ్ క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇక ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కచ్చితమైన డైట్‌ని కూడా ఫాలో కావాలి. అలాగే ప్రతిరోజూ వీలైనన్ని సార్లు నీరు తాగాలి. కనీసం రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. నీరు తాగాటం వల్ల చెమట ద్వారా చాలా వ్యర్థాలు బయట వెళ్ళిపోతాయి.
ఫైబర్(పీచు) ఎక్కువగా ఉండే పండ్లను ఎక్కువగా తినాలి.
ఎండలో వెళ్లేటప్పుడు కచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి.
రాత్రిపూట మేకప్ వేసుకుని అస్సలు పడుకోవద్దు. మేకప్ పూర్తిగా తీసివేసి ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేసి నిద్రపోవాలి.
చర్మానికి హాని కలిగించే రసాయనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది.
ముఖం, శరీరం కోసం వివిధ మాయిశ్చరైజర్లు ఇంకా ఎక్స్‌ఫోలియేటింగ్ క్రీమ్‌లను తప్పక వాడాలి.
చర్మం రకం ప్రకారం ఎల్లప్పుడూ మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగటం చాలా మంచిది.
మొటిమల సమస్య ఉంటే కచ్చితంగా ప్రత్యేక టవల్ ఉపయోగించాలి.