Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనావైరస్ వల్ల పరిస్థితులు మారాయి. దీని ప్రభావం తరచూ వాడే సౌందర్య సాధనాలపై కూడా పడింది. అంతకు ముందు ఉన్నట్టు ఉత్పత్తులు అందుబాటులో ఉండటం లేవు. కొన్ని అందుబాటులో ఉన్నా వాటికోసం బయటికి వెళ్లడానికి చాలా మంది సంకోచిస్తున్నారు. అలాంటి వారి కోసం ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు ఇవే..
తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. రోజుకు రెండుసార్లు ముఖంపై అప్లై చేయాలి. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాల వల్ల ముఖంపై పేరుకుపోయిన మలినాలు తొలగుతాయి. దీని కోసం తరచూ నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేయాలి
ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలిగిపోవాలి అనుకుంటే కీరదోస ముక్కను తీసుకుని ముఖంపై మెల్లిగా రుద్దాలి. కొన్ని నిమిషాల తర్వాత కీరదోసను తొలగించాలి.
కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్‌ను తొలగించాలి అనుకుంటే కీరదోస ముక్కల్ని మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.
తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. తర్వాత నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారంలో ఫలితం కనిస్తుంది.