Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలాలకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటూ వుండాలి. ఈ శీతాకాలంలో స్వీట్ పొటాటోస్తో క్యాలరీలను సులువుగా, అధిక పోషకాలను పొందవచ్చు. అవి మీ ఆలూ కంటే ఎక్కువ చక్కెర కంటెంట్ కలిగి ఉన్నప్పటికీ దాని పోషక విలువ చాలా ఎక్కువగా ఉంటుంది.
మోరంగడ్డలో పొటాషియం ఫైబర్, విటమిన్ ఎ కి గొప్ప మూలం. తరచూ ఇవి తీసుకుంటుంటే మలబద్ధకాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
ఖర్జూరాల్లో ఉండే తక్కువ కొవ్వు పదార్థాలు బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి. అవి పోషకాల పవర్-హౌస్. జిమ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా తింటుండాలి. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది.
శీతాకాలంలో బాదం, వాల్నట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చురుకైన నాడీ వ్యవస్థ, ఇన్సులిన్‌కు మెరుగైన సున్నితత్వంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రాగి జావ తీసుకోవడం ద్వారా శరీరానికి కాల్షియం పుష్కలంగా అందుతుంది. మధుమేహం, రక్తహీనతను నియంత్రించడంలో రాగులు సహాయపడుతాయి.