Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమెలియా క్లార్క్... ఓ హాలీవుడ్ నటి. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో తనను నగ సన్నివేశాలు చేయమంటూ ఒత్తిడి చేసినట్టు ఓ సందర్భంలో చెప్పింది. అలాగే 'పున్నగై మన్నన్'లో నటుడు కమల్‌హాసన్ తన అనుమతి లేకుండా ముద్దుపెట్టుకున్నాడని బాలివుడ్ నటి రేఖ మరో సందర్భంలో చెప్పారు. ఇలా హాలీవుడ్ నుండి మొదలుకొని టాలీవుడ్ వరకు ఎంతో మంది నటీమణులు ఇలాంటి ఒత్తిడికి గురౌతూనే ఉన్నారు. కొందరు ధైర్యం చేసి బయటకు చెప్పుకుంటున్నారు. మరికొందరు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. అలాంటి వారు తమ సమస్యను స్వేచ్ఛగా చెప్పుకునేలా ఓ వేదిక ఏర్పాటు చేయాలని భావించింది ఆస్తా ఖన్నా. అందుకే ఇన్టిమేసీ కోర్డినేటర్‌గా శిక్షణ తీసుకుంది. ఇప్పుడు భారతదేశంలోనే అలాంటి సిర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి ఏకైక మహిళ ఈమెనే. అసలు ఆమె ఇలాంటి కోర్సు ఎందుకు చేయాల్సి వచ్చింది.. సినీ పరిశ్రమలో జరుగుతున్న ఇలాంటి లైంగిక దాడుల గురించి... ఆమె ఏం చెబుతుందో తెలుసుకుందాం...
భారతీయ చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌లలో పాక్షిక నగత్వం, ముద్దులు, అనుకరణ సెక్స్‌తో కూడిన సన్నివేశాలు సర్వసాధారణం అయ్యాయి. అలాంటి సన్నివేశాల్లో నటించేటపుడు నటీమణులకు కొన్ని హక్కులు ఉండాలని అంటుంది ఆస్తా. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా సెట్లు సురక్షితమైన పని ప్రదేశంగా ఉండాల్సిన అవసరం ఉంది. సెట్స్‌లో సాన్నిహిత్య సన్నివేశాలలో పాల్గొనడానికి అంగీకరించిన నటీనటుల సౌలభ్యం, శ్రేయస్సును నిర్ధారిస్తూ భారతదేశపు మొదటి సాన్నిహిత్యం సమన్వయకర్తగా అవతరించే మార్గంలో ఉంది ఆస్తా ఖన్నా.
పరిశోధన ప్రారంభించి
ఆస్తా యూనివర్శిటీ ఆఫ్ యార్క్ నుండి ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టడీస్‌పై తన కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆమె సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడానికి ముంబైకి వెళ్లింది. ''నేను శకున్ బాత్రా ద్వారా ఓ చిత్రానికి సంతకం చేసాను. మేము దాని గురించి చర్చిస్తున్నప్పుడు కొంత వరకు సాన్నిహిత్య సన్నివేశాలు ఉన్నాయని గుర్తించాను. అతను ఆ సన్నివేశాలు ఎంత సహజంగా తీసుకురావాలనే దానిపై దృష్టిపెడుతున్నపుడు నేను కూడా దీనిపై నా పరిశోధనను ప్రారంభించాను'' అని ఆమె చెబుతుంది.
శిక్షణ తీసుకుని
ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు సాన్నిహిత్య సమన్వయకర్త పాత్ర చాలా ముఖ్యమైనదని ఆస్తా గుర్తించింది. అయితే భారతదేశంలో ఎవరూ అలాంటి పని చేయడం లేదు. ''ఇది చాలా ఉత్తేజకరమైనది. ఎందుకంటే దీన్ని నేను బలంగా భావించే రెండు కారణాల వల్ల ఎంచుకున్నాను. అందులో ఒకటి చవీమశీశీ ఉద్యమం. మరొకటి లింగం, లైంగిక వైవిధ్యం'' అని ఆమె చెప్పింది. ఆస్తా షకున్తో ఆరు నెలలు సెలవు తీసుకుంటానని చెప్పింది. షూట్ తర్వాత ఇన్టిమేసీ కోఆర్డినేటర్‌గా శిక్షణ పొందేందుకు లాస్ ఏంజెల్స్‌కు వెళతానని అన్నది. ఇంతలో కరోనా వైరస్‌తో షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఆమె అమండా బ్లూమెంటల్ వారి 'ఐపిఏ ఇన్టిమేసీ కోఆర్డినేటర్' శిక్షణా కార్యక్రమంలో చేరి సర్టిఫికేట్‌ను పొందింది.
మన దగ్గర సమయం పడుతుంది
ఇంటిమసీ కోఆర్డినేటర్ పాత్ర పాశ్చాత్య దేశాలలో ప్రజాదరణ పొందినప్పటికీ మన దేశంలో ఈ వృత్తిని అంగీకరించడానికి కొంత సమయం పడుతుందని ఆస్తా అభిప్రాయం. ''ఇది పూర్తిగా భిన్నమైన విభాగం. ఇది మన దగ్గర ప్రాధమిక దశలోనే ఉంది. అంటే మనం నేర్చుకోవల్సింది చాలా వుంది. దీన్ని ప్రోత్సహించే వారు కూడా ఉన్నారు. అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి'' ఆమె చెబుతుంది.
ఎలాగో తెలియడం లేదు
''పాత్రను ఎలా స్వీకరించాలి అనేదానిపై నాకు ఎల్లప్పుడూ స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతి నటుడు, దర్శకుడు, ప్రతి ప్రొడక్షన్ దీన్ని అర్థం చేసుకోవడం, సర్దుబాటు చేయడం, విభిన్నంగా పనిచేయడం చాలా అవసరం'' అని ఆమె జతచేస్తుంది. కొందరు దీన్ని అర్ధం చేసుకుంటారని, మరికొందరు అనుమానాస్పదంగా ఉంటారని ఆమె గమనించింది. కొందరు తమకు సాన్నిహిత్యం సమన్వయకర్త కావాలనుకున్నప్పుడు, వారికి ఎలా సహకరించాలో తెలియదని చెబుతారు.
పనిని అంగీకరించినపుడు
''పరిశ్రమ గురించి ఓ మంచి విషయం ఏమిటంటే చాలా పని నోటి మాట ద్వారా జరుగుతుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అనడంలో సందేహం లేదు. మీరు చేసే పనిని అంగీకరించడం ప్రారంభించినప్పుడు వ్యక్తులు మిమ్మల్ని తీవ్రంగా పరిగణించడం ప్రారంభిస్తారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటివి మన దగ్గర స్వాగతించబడుతున్నాయి. ఎందుకంటే అవి ఇతర ఇన్టిమేసీ కోఆర్డినేటర్లతో కూడిన అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లు. కాబట్టి వారు ఆ భావనను అర్థం చేసుకుంటారు. చిన్న ప్రొడక్షన్లకు విరుద్ధంగా లేదా భారతదేశంలోని పెద్ద ప్రొడక్షన్ల మాదిరిగానే అవి ఎప్పుడూ ఇంటిమసీ కోఆర్డినేటర్‌ను కలిగి ఉండవు.
కొన్నింటికే పరిమితం కాదు
ఒక సన్నివేశం లేదా ప్రదర్శనకు ఏది అవసరమో దాని ప్రకారం ప్రక్రియ ప్రత్యేకతలు భిన్నంగా ఉంటాయని ఆస్తా అంటుంది. ఆమె తన పాత్రను ''కొరియోగ్రాఫర్, యాక్షన్‌కి మధ్య జరిగే వివాహం''తో పోల్చింది. ఏది ఏమైనప్పటికీ సాన్నిహిత్యం సన్నివేశాలు కేవలం మేకింగ్, సెక్స్, నగత్వాన్ని ప్రేరేపించడం మాత్రమే కాకుండా మైనర్లు, విభిన్న జెండర్లు, లైంగికత, నేపథ్యాల వ్యక్తులతో కలిసి పని చేయడం కూడా అని ఆమె స్పష్టం చేసింది. ''ఇది అన్ని రకాల శరీర స్పర్శ, స్వీయ స్పర్శ, హస్త ప్రయోగం, శరీరాన్ని అన్వేషించడం, స్క్రీన్‌పై మైనర్లు, తల్లిదండ్రుల మధ్య కుటుంబ పరస్పర చర్యలతో ఏదైనా కలిగి ఉంటుంది'' అని ఆమె చెప్పింది.
నిర్ణయాన్ని సమర్థించాలి
ఆస్తా ప్రకారం ఇన్టిమేసీ కోఆర్డినేటర్ పాత్ర అంటే నటీమణులు ఆ సన్నివేశాన్ని చేయాలా వద్ద అని నిర్ణయించుకున్నప్పుడు వారి నిర్ణయాన్ని సమర్థించడం. అదే సమయంలో దర్శకుడి దృష్టిని సాధించేలా చేయడం. నటీనటులను సెట్స్‌లో ప్రశాంతంగా ఉంచేందుకు ఆస్తా ఉంది. సన్నివేశాలను వారు సౌకర్యవంతంగా చేయడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని ఆమె ద్వారా వారు తెలుసుకున్నారు. దర్శకుడు, నటులు సాన్నిహిత్యం గురించి భిన్నమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? ఇక్కడ కమ్యూనికేషన్ కీలకమని ఆస్తా అభిప్రాయపడింది.
స్పష్టమైన అవగాహనతో
''మేము మాట్లాడుకోగలం. కమ్యూనికేషన్ అన్ని సమయాల్లో స్పష్టంగా ఉంటుంది. నేను ఎల్లప్పుడూ సాన్నిహిత్యం గురించి స్పష్టమైన, సంక్షిప్త, సంక్షిప్త సంభాషణలను ప్రోత్సహిస్తాను. వారు ఏమి చేస్తారు? వారి చేతులు ఏమి చేస్తున్నాయి? వాళ్ల కాళ్లు ఏం చేస్తున్నాయి? మీరు వారి శరీరంలోని ఏ భాగాన్ని చూస్తున్నారు? దీన్ని ఎలా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు? ఎంత మంది ఉంటారు? అంతా ఎవరు చూస్తున్నారు? ఇలాంటి మొత్తం ప్రశ్నల జాబితాను దర్శకుడిని అడుగుతారు. అదే సమయంలో నటీమణికి ఆ సమాచారం మొత్తం ఇవ్వబడుతుంది.
నిర్మాతలు అంగీకరించాలి
నటీమణికి తన శరీరంలో ఏ భాగాన్ని తాకడం ఇష్టం లేకపోయినా దానికి దగ్గట్టు ఓ నిర్దిష్ట మార్గంలో సన్నివేశాన్ని చిత్రీకరించడానికి నిర్మాతలు అంగీకరించాలి. ఒక వేళ ఆ సన్నివేశంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దానికి తగిన చర్యలు తీసుకుంటారు. ఇది స్పష్టంగా వివరించబడుతుంది. నటీమణుల శరీరాన్ని ఎక్కడబడితే అక్కడ తాకడం సౌకర్యంగా ఉంటుంది. కోవిడ్ - 19 సమయంలో కొంతమంది నటీనటులు ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడానికి సౌకర్యంగా లేరు. కాబట్టి ఇలాంటి భావోద్వేగాన్ని సాధించడానికి కొరియోగ్రఫీలో వివిధ పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి.
స్పష్టమైన కమ్యూనికేషన్ కీలకం
సెట్స్‌లో తమ మనసు మార్చుకుంటే నటీమణుల సమ్మతి పొందేంత మేరకు వారి హక్కులు రక్షించబడతాయని ఆస్తా చెప్పింది. ''పనికి సంబంధించిన సమ్మతిని నేను ఎల్లప్పుడూ సమర్థిస్తాను. ఎవరైనా ఏదైనా చేయడంలో అసౌకర్యంగా ఉండి, ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే మేము పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాం. మేము ప్రయత్నిస్తున్న దాన్ని సాధించడానికి వేరే మార్గాన్ని కనుగొనగలిగితే వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాం'' అని ఆమె చెప్పింది.
ఇంటిమసీ టూల్‌కిట్
ఇన్టిమేసీ డైలాగ్ అనేది నటుల నిర్మాణ ఒప్పందానికి అనుబంధం. ఇది నటులు దర్శకుడితో ముందుగా మాట్లాడుకొని ఎలాంటి సన్నివేశాలు ఆశిస్తున్నారో నిర్ణయించుకోవాలి. పెర్ఫార్మర్‌ని చూసుకుంటూనే సినిమాకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఆస్తా సెట్స్ వద్దకు తనతో పాటు ఇన్టిమేసీ టూల్‌కిట్‌ను కూడా తీసుకువెళుతుంది. ఆస్తా పని చేసిన చాలా ప్రాజెక్ట్‌లు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కాబట్టి ఆమె వాటి పేర్లను వెల్లడించలేదు. ఇప్పటివరకు ఆమె శకున్ చిత్రం, రెండు స్వతంత్ర చిత్రాలు, ధర్మ ప్రొడక్షన్, ట్రిఫెక్టా - నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ కోసం పని చేసింది. జనవరిలో రెండు ప్రాజెక్టులు విడుదల కానున్నాయి. స్క్రీన్, స్టేజ్ పెర్ఫార్మెన్స్, మన సాంస్కృతిక సందర్భంలో సాన్నిహిత్యాన్ని ఎలా నావిగేట్ చేయాలనే దాని కోసం మార్గదర్శకాల సమితిని రూపొందించడానికి ఆమె' ది ఇన్టిమేసీ కలెక్టివ్‌ని' కూడా ప్రారంభించింది.
- సలీమ