Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బెతేస్ద్ ఎం.డి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వెల్లడించారు. ఒత్తిడి, నిరాశకు గురయ్యే గర్భిణీలలో పిండంపై తీవ్ర ప్రభావం పడుతుందని పలు మార్పులు పిల్లవాడి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచించారు. ఈ మార్పులు ఎపి జనోమిక్స్లో ప్రచురించారు.
ఒత్తిడి, నిరాశ స్త్రీలలో సహజమని అది ప్రతి పదిమందిలో ఒకరికి ఈసమస్య వస్తోందని అమెరికాకు సంబందించిన ఓబీ ట్రీ షియన్, గైనకాలజిస్ట్ పేర్కొన్నారు. ఒత్తిడి లేదా నిరాశ అన్నది ప్రసవ అనంతరం పుట్టిన బిడ్డపై ఉంటుందని, వారి జీవితాంతం మనస్తత్వం, బావోద్వేగాలపై తీవ్రప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో ఒత్తిడి అన్న అంశం పై చేసిన పరిశోదన 312 మంది మహిళలపై 126 ఆసుపత్రులలో నిర్వహించారు.
పరిశోదన ప్రారంభంలో స్త్రీలకు ఒక ప్రశ్నావళి ఇచ్చి పూర్తి చేయమన్నారు. ఒత్తిడి, నిరాశను పరీక్షించేందుకు సమాచార సేకరణ జరిపారు. ఐదు సార్లు ఆ ప్రశ్నావళిని పూర్తి చేసారు. ఒక్కొక్కరు ఒక్కొకరికి జన్మనిచ్చారు. పరిశోధకులు టిష్యు సంమ్పుల్ను స్వీకరించారు. పిండం నుండి సేకరించారు. ఈ అంశంపై మార్కోస్ తెస్ఫయే గర్భిణీలలో పిండంలో వచ్చిన రసాయన మార్పులు గుర్తించారు. పిండంలో మెదడు నిర్మాణం పిండం బయట 16 సంవత్సరాలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. న్యూరో లాజికల్ సైక్రియాటిక్ ఇల్ నెస్ వస్తే వారి బిడ్డ ఇబ్బందికి గురి కాక తప్పదని తేల్చారు. అయితే గర్భిణీలు ముఖ్యంగా వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని వారే నియంత్రించుకోవాలి. గర్భిణీలు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు.