Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లి అనే బంధంతో భార్యాభర్తలు ఒకటై.. జీవితాంతం కలిసి ఉంటారు. అయితే పెండ్లి అయిన తర్వాత కొన్ని జంటలు తమ వైవాహిక జీవితంలో చిన్న పాటి మనస్పర్థల కారణంగా విడిపోతుంటారు. గొడవలతో మొదలై.. క్షణికావేశంతో ప్రాణాలను కూడా తీసే వరకు వెళ్తుంది. అయితే ఎలాంటి గొడవలు లేకుండా.. భార్యాభర్తల మధ్య బంధం గట్టిగా ఉండాలంటే.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఒకరికి కోపం వస్తే.. మరొకొరు శాంతంగా ఉంటూ ముందుకు వెళ్లాలి. అలాంటి వారిపైనే బంధం ఎలా ఉండాలనేది ఆధారపడి ఉంటుంది. చిన్న తప్పులు మీ సంబంధంలో పెద్ద గొడవలను సృష్టిస్తాయి. అపార్థాలను కలిగిస్తాయి. మీ బంధాన్ని బలహీనపరుస్తాయి. అందువల్ల ప్రతి దంపతులు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఇవే. అవేంటో ఒక్కసారి చూద్దాం...
పెండ్లి అనే బంధం దాదాపు ప్రేమ, నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా ఒకరికొకరు సహకరించుకోవాలి. అది మీ బంధాన్ని కలకాలం నిలుపుతుంది. ఎక్కువ సమయం భాగస్వామితో గడిపేందుకు సమయం కేటాయించాలి. బాధలు అయినా.. సంతోషం అయినా ఒకరినొకరు షేర్ చేసుకోవాలి. లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి.. డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో అపర్థాలు పెరుగుతాయి.
ఇక సమయం కేటాయించమన్నారు కాదా అని.. 24 గంటలు మీ సమయాన్ని కేటాయించకూడదు. వాళ్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అక్కడ వారు కొంత సమయం గడపాలని కోరుకుంటారు. స్నేహితులతో గడపాలని, ఉద్యోగం మార్చాలని అనుకుంటారు. అప్పుడు వారికి కొంత సమయాన్ని కేటాయించాలి. అది వారికి రిఫ్రెష్‌గా అనిపిస్తుంది మీపై గౌరవం రెట్టింపవుతుంది.
ఆదిపత్యం చెలాయించడానికి దంపతులు ట్రై చేయకూడదు. సమయానుసారం.. ఆ సందర్భంలో ఏమి అనిపిస్తే అదే చేయాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించుకోవాలి. పరిమితులు అందరికీ తెలుసు కానీ ఆంక్షలు పెట్టవద్దు. తాను చెప్పిందే వినాలని ఆంక్షలు అనేవి అస్సలు పెట్టోద్దు.
భార్య ఒకవేళ గృహిణి అయితే ఆమె చేసే పనిని చిన్నచూపుగా చూడొద్దు. ఎగతాళి చేసి అస్సలు మాట్లాడకూడదు. వాళ్లు ఏం చేసినా భాగస్వామి కోసమే అనేది గుర్తుంచుకోవాలి. మీ పనిని ఎలా గౌరవిస్తారో వాళ్ల పనిని కూడా గౌరవించాలి. ఇటువంటివి దంపతులు చేయడం వల్ల విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఎలాంటి కండీషన్స్ పెట్టకూడదు. పైన చెప్పిన ఈ విషయాలను దంపతులు గుర్తుంచుకోవాలి. చాలా వరకు జంటలు ఇలా పాటించకపోవడంతోనే విడిపోతున్నారని ఓ సర్వేలో తేలింది.