Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల చర్మం పెద్దల చర్మం కంటే చాలా మృదువుగా ఉంటుంది. దీంతో చర్మం సులభంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా చలికాలంలో శిశువు చర్మం చాలా పొడిగా ఉంటుంది. ఇది అలర్జీ, చికాకు, పొడిబారడం వంటి సమస్యలకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి శిశువు చర్మాన్ని ఎల్లవేళలా హైడ్రేట్‌గా ఉంచడానికి కొన్ని చిట్కాలు...
శిశువుకు ఏ లోషన్, మసాజ్ నూనె రాసినా వాటిలో మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ముఖ్యంగా వాటిలో విటమిన్ ఇ, బీ5, మిల్క్ ప్రొటీన్, రైస్ ఎక్స్ట్రాక్ట్స్ వంటి ముఖ్యమైన పదార్థాలు ఉండాలి.
సాధారణంగా శిశువుకు ఎక్కువసేపు స్నానం చేయించకూడదని చెబుతారు. ఎక్కువసేపు వేడి నీళ్లలో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. ఇది చర్మంలోని తేమెను కూడా తగ్గిస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించడం ఉత్తమం.
స్నానం చేసిన తర్వాత చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడండి. మిల్క్ ప్రొటీన్లు, రైస్ ఎక్స్‌ట్రాక్ట్‌లతో కూడిన ఉత్తమ బేబీ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం వల్ల శిశువు చర్మాన్ని ఎల్లవేళలా హైడ్రేట్‌గా ఉంచవచ్చు.
చలికాలంలో పిల్లలకు డైపర్ రాష్ చికాకు వస్తుంది. కాబట్టి బిడ్డకు తరచుగా డైపర్ మార్చాలి. చర్మం వాపు రాకుండా ఉండటానికి డైపర్ వాడే ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఆల్కహాల్ లేని, సబ్బు లేని బేబీవైప్లను ఉపయోగించడం ఉత్తమం.