Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలి తీవ్రత పెరిగిపోతుంది. ఈ కాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. దీనికి బట్టలు, సూప్ వంటి వాటి విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా చర్మాన్ని కూడా మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
ఈ సీజన్లో చర్మానికి మాయిశ్చరైజర్ చాలా అవసరం. పొడి చర్మాన్ని ప్రకాశ వంతంగా ఉంచడానికి మాయిశ్చరైజర్ మేలు చేస్తుంది.
ముఖ్యంగా ఈ సీజన్లో ఇంటి లోపలి భాగం వేడిగా ఉన్నా.. బయట చల్లగా ఉంటుంది. ఈ కూల్ టెంపరేచర్ చర్మానికి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో పెదాల పగుళ్లు, గరుకుగా మారతాయి. కాబట్టి చర్మానికి లోతైన మాయిశ్చరైజింగ్ అవసరం. తద్వారా అన్ని కణజాలాలు బాగా ఉంటాయి. దీనికోసం హైలురోనిక్ యాసిడ్, సిరామైడ్లు, కాపర్ పెప్టైడ్స్, స్క్వాలీన్ మొదలైన మాయిశ్చరైర్లను ఉపయోగించవచ్చు.
చలికాలంలో స్నానం చేసిన తర్వాత తేలికపాటి లోషన్ రాసుకోవాలి. చర్మం డ్రైగా మారిన వెంటనే మాయిశ్చరైజర్ రాయండి.
శీతాకాలం ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి చర్మ సరక్షణ. ఈ సమయంలో చర్మానికి ఏది మంచిదో తెలుసుకోవాలి. వాటిపై శ్రద్ధ వహించాలి.