Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బహుజన మహిళగా నా గుర్తింపు చాలా తక్కువగా ఉందని నేను గ్రహించాను. నేను వలస వచ్చిన సంచార తెగ నుండి వచ్చాను అనే వాస్తవం నుండి ఇది వచ్చింది. అనేక సంఘాలు పేదరికంతో బాధపడుతున్నాయి. కానీ నా తెగ తరతరాలుగా పేదరిక నిర్మూలనకు నోచుకోలేదు. స్త్రీలుగా మేము అనుభవిస్తున్న హింస లేదా అన్యాయం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటానికి మాకు వనరులు లేవు, అవగాహన లేదు
మహారాష్ట్రలోని సంచార, గుర్తింపు పొందని తెగల అభ్యున్నతి కోసం అహర్నిశలూ కృషి చేస్తుంది. ఆ అమాయకపు ప్రజల కోసం దేశంలోనే ఓ సంస్థను ఏర్పాటు చేసిన ఏకైక మహిళ దీపా పవార్. ఈమె దృఢ సంకల్పంతో సంచార, డి-నోటిఫైడ్ ట్రైబ్ (చీు-ణచీు) అనే సంస్థ, అనుభూతి ట్రస్ట్ ద్వారా స్థాపించబడింది. కులం పేరుతో వివక్షకు గురైతున్న బహుజన మహిళల కోసం పని చేస్తున్న ఆమె గురించి...
సమాజంలో అట్టడుగున, అత్యంత దారిద్య్రంలో జీవిస్తున్న సంచార, డీనోటిఫైడ్ తెగల అభ్యున్నతికి కృషి చేయాలని భావించిన దీపా పవార్ 2015లో అనుభూతి ఛారిటబుల్ ట్రస్ట్‌ని స్థాపించారు. రాజస్థాన్‌లోని లోహర్ తెగకు చెందిన దీపా కుటుంబం, మరికొన్ని కుటుంబాలు కలసి 80వ దశకం చివరిలో మహారాష్ట్రకు వలస వచ్చారు. విద్య, ఆదాయ భద్రత, అవగాహన లేకపోవడం వల్ల ఆమె తెగ ఇప్పటికీ అనేక సామాజిక అడ్డంకులను ఎదుర్కొంటోంది.
రెండు దశాబ్దాల అనుభవంతో...
ఈ తెగలో చాలామంది ప్రాథమిక విద్యను కూడా పొందలేక పోయినప్పటికీ, దీపకు చదువుకోవాలనే సంకల్పం, ఆసక్తి ఆమెను 14 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు దశాబ్దాల సామాజిక రంగంలో పని, ఫెలోషిప్‌లు, డిగ్రీల తర్వాత ఆమె మోస్ట్ ప్రామిసింగ్ ఇండివిజువల్ కేటగిరీకి ఇటీవల మార్తా ఫారెల్ అవార్డుతో సహా పలు అవార్డులను గెలుచుకుంది.
సవాలుగా ఉండేది
''విద్య గురించి మాకు ఎలాంటి అవగాహన లేదు. మా నాన్న నాలుగో, ఐదో... తరగతి వరకు చదివారు. మా అమ్మ ధైర్యం చేసి బయటకు వచ్చి చదవలేకపోయింది. నేను ఎలాగో ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేశాను. కానీ మా ప్రాంతంలో ఏడో తరగతి తర్వాత పాఠశాల లేదు. తదుపరి విద్య కోసం ఒకరు సెమీ-ప్రైవేట్ పాఠశాలకు వెళ్లవలసి వచ్చింది. 90వ దశకం చివరిలో నా కమ్యూనిటీకి ఆడపిల్లల విద్య కోసం సంవత్సరానికి రూ. 700-800 ఖర్చు చేయడం సవాలుగా ఉండేది'' అని దీప తన అనుభవాలు చెప్పారు.
మేధో అక్షరాస్యతతో ప్రయాణం
తన విద్యను కొనసాగించడానికి దీప అనేక చిన్నపాటి ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. ఆ వచ్చిన డబ్బుతో ఆమె తన ట్యూషన్ ఫీజు చెల్లించేది. ''నగరంలోని మురికివాడల్లో నివసించే చిన్నపిల్లలు, మహిళలకు అక్షరాలు నేర్పించడానికి నా వయసు అమ్మాయి కోసం వెతుకుతున్న ఒక ఎన్జీఓ గురించి ఆ సమయంలో తెలుసుకున్నాను. నేను వారితో చేరి మేధో అక్షరాస్యతలో నా ప్రయాణం ప్రారంభించాను'' ఆమె చెప్పింది.
అనుభూతి ట్రస్ట్ ఎందుకు
అనుభూతి అంటే అనుభవించడం లేదా సానుభూతి పొందడం మాత్రమే కాదు. బౌద్ధ తత్వశాస్త్రం నుండి వచ్చిన తన ట్రస్ట్ గురించి దీప చెప్తూ ''ముంబయి శివారు ప్రాంతాలు, మురికివాడల్లోని వివిధ ప్రాంతాలలో గిరిజన, వలస వర్గాల యువత పురోగతి కోసం ఇది పనిచేస్తుంది'' అన్నారు. అనుభూతి ట్రస్ట్‌ను పారంభించే ముందు దీప మహారాష్ట్ర వ్యాప్తంగా లింగం, ఆరోగ్యం, హక్కులు, నాయకత్వం, మార్గదర్శకత్వం, సమాజ అభివృద్ధి, పారిశుధ్యం మొదలైన సమస్యలపై యువత, మహిళలు, సంఘాలు, ఎన్జీఓలు, కళాశాలలు అలాగే స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా పనిచేశారు. 35 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె గడియా లోహర్ సంచార జాతుల ఇనుప పనిముట్ల తయారీని డాక్యుమెంట్ చేస్తూ మొట్టమొదటి పుస్తకాన్ని సృష్టించారు.
నా తెగ కోసం చేయాలి
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్‌కు చెందిన దీపా సామాజిక రంగంలో విజయవంతంగా పనిచేస్తున్నప్పటికీ అనుభూతి ట్రస్ట్‌ను ప్రారంభించేందుకు తనను ప్రేరేపించిన విషయాలను ఇలా పంచుకున్నారు ''2010-11లో సామాజిక రంగంలో దశాబ్దం పాటు పనిచేసిన తర్వాత నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బహుజన మహిళగా నా గుర్తింపు చాలా తక్కువగా ఉంది. నేను వలస వచ్చిన సంచార తెగ నుండి వచ్చాను అనే వాస్తవం నుండి ఇది వచ్చింది. అనేక సంఘాలు పేదరికంతో బాధపడుతున్నాయి, కానీ నా తెగ తరతరాలుగా పేదరిక నిర్మూలనకు నోచుకోలేదు. లింగ హింస లేదా అన్యాయం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటానికి వనరులు లేదా అవగాహన లేదు'' అని ఆమె చెప్పింది.
అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది
దీపా చెప్పిన ప్రకారం సామాజిక రంగంలో ఎంతగా పనిచేసినప్పటికీ తన సొంత వర్గానికి చేరుకోలేకపోయిందని ఆమె తెలుసుకుంది. ''అసలు నా లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. నేను దానిని మరింత ముందుకు తీసుకెళ్లలేనప్పుడు అందులో పని చేయడం వృధా. అందుకే నేను పని చేస్తున్న ఎన్జీఓలో నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. నా సొంత సంస్థ ''అనుభూతి ట్రస్ట్' మోదు చేసుకున్నాను'' అని ఆమె జతచేస్తుంది.
అనేక రంగాలలో కృషి
అనుభూతిలో దీప ప్రస్తుతం విజనింగ్, ప్రాజెక్ట్ డిజైనింగ్, ట్రైనింగ్, మాడ్యూల్-మేకింగ్, నెట్వర్కింగ్, అడ్వకేసీని నిర్వహిస్తోంది. ఆమె పని చేసే కొన్ని రంగాలలో మానసిక న్యాయం, సామాజిక భద్రత, న్యాయం, సాధికారత, నాయకత్వ శిక్షణ, లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య హక్కులు, సురక్షితమైన ఉన్నత విద్య వంటివి ఉన్నాయి. బహుజన స్త్రీల కోసం దీప చేస్తున్న కృషికి గాను యుకే బర్కిలీ వారు నిర్వహించిన హర్ స్టోరీ కాంటెస్ట్ 2018లో గ్రాండ్ ప్రైజ్ విజేతగా కూడా నిలిచారు. అలాగే సీఐఐ ఫౌండేషన్ వారి ఉమెన్ ఎక్సెంప్లర్ అవార్డ్ 2018లో ఫైనలిస్ట్‌గా నిలిచారు.
- సలీమ