Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శనగ పిండిలో కొద్దిగా పాలు, నీటిని కలిపి దాన్ని ముఖానికి రాయండి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడగాలి. కడిగేటపుడు ముఖాన్ని సర్క్యూలర్ మోషన్ ద్వారా రుద్దుతూ కడగాలి. దీంతో మీ ముఖం మెరుస్తుంది.
ముఖానికి పెరుగు, ఓట్మీల్ కలిపిన పేస్ట్‌ను.. సర్క్యూలర్ మోషన్లో మసాజ్ చేయాలి. దీనివల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. మీ ముఖం మరింత కాంతివంతంగా మారుతుంది.
చర్మాన్ని సహజంగా మెరిసేలా చేసే గుణం నిమ్మరసానికి ఉంటుంది. నిమ్మరసంలో కొద్దిగా పంచదార కలిపి ముఖానికి రాసి, ఓ పది నిమిషాలపాటు సర్క్యూలర్ మోషన్లో రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మీ రంగు ప్రకాశవంతంగా మారిపోతుంది.
బాదం పొడిలో కాస్త పచ్చిపాలు, ఓట్మీల్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే.. మీ రంగు మరింత కాంతివంతంగా మారిపోతుంది.