Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీరియడ్స్ సమయంలో ఇబ్బందులు పడటం సర్వసాధారణం. అయితే.. అందరికీ ఈ నొప్పి ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా కడుపునొప్పి అనేది అందరికీ వచ్చేది కాదు. కొందరికి మితంగా మరికొందరికి తీవ్రంగా ఉంటుంది. కొందరికి నొప్పి కూడా ఉండదు. తీవ్ర కడుపునొప్పితో బాధపడేవారు ఈ చిట్కాలను పాటించండి. అప్పటికే తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
హాట్ ప్యాడ్.. పొత్తికడుపు నొప్పి ఉన్నప్పుడు మీ పొత్తి కడుపుపై హాట్ ప్యాడ్ ఉంచడం వల్ల నొప్పి కాస్త తగ్గుతుంది. గర్భాశయ కండరాలు కొద్దిగా తేలికగా మారి నొప్పి తగ్గుముఖం పడుతుంది. హాట్ ప్యాడ్ లేకపోతే వాటర్ బాటిల్ కూడా ఉపయోగించవచ్చు.
మసాజ్ థెరపీ.. సరైన మసాజ్ థెరపిస్ట్ చేయవలసిన శిక్షణ ఇది. పొత్తికడుపు మధ్య వీపుపై ఒత్తిడి పెడుతూ మసాజ్ చేయాలి. ఈ మసాజ్ 20 నిమిషాలు చేయడం వల్ల నప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఫుడ్.. పీరియడ్స్ సమయంలో దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలను ఎప్పుడూ ముట్టుకోకండి. ఆరోగ్యకరమైన ఆహారాలు పండ్లు, కూరగాయలు తినాలి. అంతేకాదు నీరు పుష్కలంగా తాగాలి.
హర్బల్ టీ.. హెర్బల్ టీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల పొత్తికడుపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి అల్లం టీ, సోంపు టీ, ఇతర టీలు తాగవచ్చు.
పీరియడ్స్ సమయంలో కండరాల బలోపేతం చేసే మితమైన వ్యాయామాలు చేయాలి. నిపుణుల సలహా మేరకు యోగా కూడా చేయవచ్చు.