Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందం... ఆరోగ్యం... ఈ రెండూ మనల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతాయి. అందుకే మార్కెట్లో వీటికి ప్రాధాన్యం బాగా పెరిగింది. దీన్నే తన ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు కొంగర రేవతి. ఓ బ్యూటీషియన్‌గా తనని తాను అప్డేట్ చేసుకుంటూ తన వద్దకు వచ్చే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.
మీ నేపథ్యం చెప్పండి?
నా పేరు కొంగర రేవతి. నా భర్త పేరు రమేశ్. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలానికి చెందిన రంగంబంజర అనేది మా సొంత గ్రామం. బిఇడీ పూర్తి చేశాను..
బ్యూటీషియన్‌గా మీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది?
నేను బిఇడీ పూర్తి చేసిన తరువాత జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూశాను. తర్వాత నా భర్త హెయిర్ స్టైలిస్ట్ కావడం వల్ల నన్ను కూడా బ్యూటీషియన్‌గా ట్రైనింగ్ తీసుకొమ్మని ప్రోత్సహించారు. కానీ నేను మొదట్లో ట్రైనింగ్‌కి వెళ్ళడానికి భయపడ్డాను. తర్వాత మా వారి ప్రోత్సాహం వలన మిర్రర్ అకాడమీలో స్కిన్ కేర్ విభాగంలో అడ్వాన్సడ్ టైనింగ్ తీసుకున్నాను. అప్పటి నుండి బ్యూటీషియన్‌గా కెరీర్ కొనసాగిస్తున్నాను.
ఈ వృత్తి వలన మీకు లభించిన సంతృప్తి?
బ్యూటీషియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక బ్యూటీషియన్ గా ఇతర వ్యక్తులను అందంగా చూపించడం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని నా నమ్మకం. ప్రతి వ్యక్తి తమదైన అంత:సౌందర్యం కలిగి ఉంటారు. ఇతరుల జీవితంలో అతి ముఖ్యమైన రోజున వారు కోరుకుంటున్న విధంగా వారిని మేకోవర్ చేసినపుడు వారు సంతోషంతో కృతజ్ఞతలు చెప్పినపుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
మీకు ఎలాంటి విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేయడమంటే ఇష్టం?
వృత్తిపరంగా వచ్చిన ప్రతి క్లయింట్‌కు ఎటువంటి సర్వీస్ ఇస్తే వారు పూర్తి సంతృప్తి చెందుతారో తెలుసు కోవాలనుకుంటాను. క్లయింట్‌కు సంబంధించిన స్కిన్ కేర్ సమస్యలకు పరిష్కారాలు చూపించడంపై ఎక్కువ ఫోకస్ చేస్తాను. నాణ్యమైన, చవకైన పద్ధతుల ద్వారా క్లయింట్‌కు సేవలందించడంపై ఫోకస్ చేస్తాను..
మీరు పొందిన గౌరవ సత్కారాలు?
మా వద్దకు వచ్చిన క్లయింట్స్‌కి నేను అందించిన సేవలకు గాను వారు తమ సంతృప్తిని వ్యక్తపరిచితే అదే నాకు పెద్ద పురస్కారంగా భావిస్తాను..
ళీ సమయాల్లో ఎలాంటి పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు?
ఖాళీ సమయాల్లో నన్ను నేను మేకప్, హెయిర్‌కు సంబంధించిన అప్ డేటేడ్ విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మార్కెట్లో కొత్తగా వచ్చిన ఉత్పత్తుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను..