Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం మొదలు కాగానే శరీరంలో తేమ తగ్గిపోతుంది. తలమీది చర్మంపై పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోతుంది. కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. ఆ చిట్కాలేంటో చూద్దాం..
పండిన అరటిపండును మెత్తగా చేసి దానిలో కాస్త పెరుగు వేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టంతా అప్లై చేయండి. తర్వాత జుట్టును షవర్ క్యాప్‌తో కప్పుకోండి. హెయిర్ మాస్క్‌ను 40-45 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. డ్రై హెయిర్ సమస్య ఉన్నవారు ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మళ్లీ అప్లై చేయండి. దాంతో మీ జుట్టు బలంగా తయారవుతుంది.
పండిన అరటిపండును పీల్ చేసి కట్ చేసి బ్లెండర్లో బ్లెండ్ చేయండి. దానికి కొంచెం అలోవెరా జెల్ కూడా కలపండి. ఇది మెత్తని పేస్ట్ అయ్యే వరకు బాగా బ్లెండ్ చేయాలి. ఈ మాయిశ్చరైజింగ్ హెయిర్ మాస్క్‌ని జుట్టు మొత్తానికి కుదుళ్ళ నుండి చివర్ల వరకు అప్లై చేయండి. ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఈ ప్యాక్‌ను 40 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయండి. జుట్టు ధృడంగా ఉండటం ఖాయం.