Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత ప్రపంచంలో మనషులకంటే యంత్రాలే విలువైనవి. ఆఫీసుల్లో పనిచేసేవారు మిషన్ల వలె ఉండాలని సూపీరియర్స్ ఆశిస్తారు. అయితే చాలా సార్లు మనం చేసే పనికి సరైన గుర్తింపు లభించదు. ఈ కరోనా కాలంలో గంటల తరబడి పని చేస్తే దానికి తగిన వేతనం కూడా రావడం లేదు. అందుకే చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు. దాంతో ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేస్తున్న పని మీకు సరిపోదని, అది మిమ్మల్ని గుర్తించే పని కాదని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి...
- ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అన్ని కార్యాలయాల్లో ఒత్తిడి పెరిగిపోతోంది. కానీ పనికి తగిన వేతనం లేదు. అయితే ఆ పనిలో పొద్దస్తమానం మునిగి పోవాల్సి వస్తోంది. అది ఎంత అంటే... పని మధ్యలో కొన్ని నిమిషాల విరామం కూడా తీసుకోలేనంత దారుణంగా ఉంటుంది. అప్పుడు అది మీకు సెట్ కాని జాబ్ అని తెలుసుకోండి. ఈ సందర్భంలో మీరు దాన్ని గురించి మీ యజమానితో మాట్లాడాలి లేదా మరొక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. తక్కువ జీతం వచ్చే ప్రదేశంలో ఉండటం మంచిది కాదు.
- మీరు మీ మేనేజర్స్‌కు ప్రాజెక్ట్‌ను సమర్పించినప్పుడు మీరు చాలా భయపడుతున్నారా? అంటే మీ మేనేజర్ ఎప్పుడూ మీ పై బ్యాడ్ రివ్యూలు వేస్తున్నారని అర్థం. ముఖ్యంగా మీరు మీ పనిని ఎంత బాగా పూర్తి చేసినా అతడు మీతో ఇగ్నోర్ చేసినట్టు వ్యవహరిస్తే.. అది మీకు తగిన ఉద్యోగం కాదని అర్థం.
- మీ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి సరైన విశ్రాంతి లేకుండా పని చేయడం మంచిది కాదు. ముఖ్యంగా మీరు అలసిపోయినప్పుడు, తలనొప్పి, ఒత్తిడికి గురైనప్పుడు కంపెనీని వదిలివేయండి. ఇలాంటి సమస్యలు ఎదురౌతున్నపుడు మీరు మీ గురించి పట్టించుకోకుండా పనిని చేయడం మంచిది కాదు.
- చేసే పనికి సరైన గుర్తింపు లేకపోతే మనశ్శాంతి కచ్చితంగా ఉండదు. మీ తప్పులను ఎత్తి చూపే బాస్ మీరు మంచి పనులు చేసినప్పుడు దాన్ని కూడా పైకి చెప్పాలి. లేకపోతే ఆ ఉద్యోగంలో ఉండకపోవడమే మంచిది.
- మీరు తప్పు చేస్తే జట్టులో ఉన్న జూనియర్ బాధ్యత అని మిమ్మల్ని నిందించకూడదు. జట్టులో ఉన్న ప్రతిఒక్కరిదీ బాధ్యత అవుతుంది. అలా వ్యవహరించకపోతే మారు తప్పు పని ప్రదేశంలో ఉన్నారని అర్థం.