Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో చాలా మంది నీరసంగా ఫీలవుతున్నారు. ఇది అలసట, తక్కువ శక్తి స్థాయిల వల్ల కావచ్చు. మీ దినచర్యలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. శక్తి స్థాయిలను పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
పోషకాహారం: పోషకాహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. దీంతో ఏ పని అయినా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. తీపి పదార్థాలను తగ్గించండి.
ఒత్తిడి తగ్గించుకోండి: ఒత్తిడికి గురవడం మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడి తగ్గించుకుంటే మీలో శక్తి పెరుగుతుంది. కాబట్టి అవకాశం దొరికినపుడల్లా విశ్రాంతి తీసుకోవడం, బయట వాకింగ్ చేయడం, చదవడం, వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గించుకోవచ్చు.
ఇతరులతో కమ్యూనికేట్: మంచి ఆరోగ్యానికి ఇతరులతో కలివిడిగా ఉండడం చాలా అవసరం. వ్యక్తులతో కమ్యూనికేషన్ లేకపోతే మానసికంగా అలసిపోతాము. శక్తి స్థాయి తగ్గుతుంది. అందుకే స్నేహితులు, బంధువులతో సంబంధాలు మెరుగుపరుచుకోండి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
హైడ్రేటెడ్‌గా ఉండండి: నీరు సరిగా తాగకపోతే మెదడు పనితీరు, శక్తి స్థాయిలు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. శరీరానికి సరైన మోతాదులో నీరు అందాలి. మీరు వేడి వాతావరణంలో నివసిస్తున్నట్టయితే ఇంకా ఎక్కువ నీరు తీసుకోవాలి.
సరైన నిద్ర: మంచినిద్ర లేకపోతే మనలో శక్తి తగ్గిపోతుంది. ఇది మరుసటి రోజు ఉదయం చిరాకు కలిగిస్తుంది. పని చేయాలనిపించదు. ఒక వ్యక్తికి కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. కాబట్టి రోజూ ఏడలైనా హాయిగా నిద్ర పోవడానికి ప్రయత్నించండి.