Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో ఇబ్బంది పెట్టే సమస్య గొంతు నొప్పి. ఇది గొంతులో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పిమొదలవుతుంది. ఆ తర్వాత వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని పాటి ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది.
- గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిళించాలి. ఇలా చేస్తే గొంతునొప్పి మటుమాయం.
- అల్లం టీ గొంతు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు గొంతు ఇన్ఫెక్షన్ను కూడా నివారిస్తుంది.
- మిరియాలతో పాలు తాగినా కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.
- గొంతు నొప్పితో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే నొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది.
- తేనె- నిమ్మరసం గోరువేచ్చని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితాన్నిస్తుంది. గొంతునొప్పి ఉండే సమయంలో చల్లని నీరు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.