Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లవం గంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది.
- లవంగం పంటి నొప్పితో పాటు నోటి దుర్వాసన కూడా నివారిస్తుంది.
- దగ్గుకు సహజమైనా మందు లవంగం.
- శ్వాస సంబంధింత సమస్యలకు కూడా బాగా పని చేస్తుంది.
- తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది.
- తేనె, కొన్ని లవంగాల నూనెను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
- లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది.
- వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.
- తులసి, పుదీనా , లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది .
- లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.
7మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది
- 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది.
- క్రమం తప్పకుండా ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.