Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతాకాలంలో వేడివేడిగా సూప్ తాగాలని చాలామంది అనుకుంటారు. అయితే ఏదో తాగామంటే తాగామనట్టు కాదు. సూప్‌లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
- ఎండుమిర్చి కలిపిన సూప్ తాగడం వల్ల జలుబు లేదా గొంతునొప్పి వచ్చినా త్వరగా ఉపశమనం లభిస్తుంది. - శరీరంలో బలహీనత ఉన్నట్టు అనిపించినప్పుడు సూప్ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బలహీనతను తొలగించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జ్వరం, శారీరక నొప్పి, జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు వ్యతిరేకంగా పోరాడడంలో కూడా సహాయపడుతుంది.
- సూప్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పలు వ్యాధులు నయం చేసేందుకు కూడా సూప్ వినియోగిస్తారు. ఎందుకంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఎలాంటి సమస్యకు కారణం కాదు. దీని వల్ల అనారోగ్యం తర్వాత మందకొడిగా మారిన జీర్ణవ్యవస్థను కూడా ఒక క్రమపద్ధతిలో పనిచేయడం ప్రారంభిస్తుంది.
- నోటి రుచి మారుతూ ఉంటే, ఏదీ రుచిలేనిదిగా అనిపిస్తే సూప్ తాగండి. ఇది రుచిని తిరిగి తీసుకురావడానికి మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇది రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. - శారీరక బలహీనతలో సూప్ తీసుకోవడం వల్ల మీకు శక్తి లభిస్తుంది. మీరు మునుపటి కంటే ఆరోగ్యంగా ఉంటారు. క్రమంగా శక్తి స్థాయి కూడా పెరగడం మొదలవుతుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు.
- అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా జ్వరం సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు ఇలాంటి సమయాల్లో సూప్ తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి నీరు, పోషకాలు రెండూ లభిస్తాయి. బలహీనత కారణంగా కారణంగా బ్యాక్టీరియా, వైరస్ ప్రమాదం పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే మన రోజువారీ ఆహారంలో సూప్ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి బయటపడొచ్చు.
- తక్కువ కేలరీలను తీసుకోవాలనుకుంటే, త్వరగా బరువు తగ్గాలనుకుంటే సూప్ కంటే మించింది లేదని చెప్పవచ్చు. ఇందులో మీకు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. సూప్‌లలో పోషకాలు, కేలరీలు ఎక్కువగా ఉండవు. సూప్ తాగడం వల్ల కడుపు కూడా త్వరగా నిండుతుంది. ఇది పోషక పదార్ధాలతో నిండి ఉంటుంది. సూప్‌లు తయారు చేసే కూరగాయల లేదా ఇతర ఆహార పదార్ధాల సారాంశం సూప్‌లో ఉంటుంది. ఇది కాకుండా అనేక పోషకాలతో కూడిన సూప్ అంతర్గతంగా బలాన్ని ఇస్తుంది.