Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియా పటేల్... భారతదేశంలో పుట్టిన బ్రిటీష్ అంతరిక్ష శాస్త్రవేత్త. ఇటీవల యునైటెడ్ స్టేట్స్లో ఒక ఎన్జీఓను ప్రారంభించారు. అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూనే నిరుపేద పిల్లలకు సహాయం చేస్తుంది. తన అమ్మమ్మ పేరుతో శారదా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఒక ఎన్జీవోను ప్రారంభించడానికి తనను ప్రేరేపించిన విషయాల గురించి ఆమె మనతో పంచుకుంటున్నారు.
''భారతదేశానికి వనరులను తీసుకు రావడమే ఈ ఎన్జీఓ ప్రధాన లక్ష్యం. ఇక్కడ పుష్కలమైన నైపుణ్యం, అంతరిక్ష అన్వేషణ పట్ల అభిరుచి ఉంది. ఈ లాభాపేక్షలేని సంస్థ ప్రధానంగా అంతరిక్ష సంబంధిత కోర్సులపై ఆసక్తి ఉండి వెనుకబడిన సామాజిక, ఆర్థిక నేపథ్యం కలిగిన భారతీయ విద్యార్థులకు సహాయం చేస్తుంది. ఇదే ఆశయంతో పని చేయాలని ఫౌండేషన్ కోరుకుంటుంది. ప్రతిభావంతులైన, ఔత్సాహిక భారతీయ పాఠశాల విద్యార్థు లకు నాసా వంటి విదేశీ అంతరిక్ష సంస్థ గురించి, అక్కడ వుండే సౌకర్యాలను తెలియజేసి, విదేశాలలో అంతరిక్ష
అధ్యయనం చేయగలిగేలా వారిని తీర్చిదిద్దాలి'' అని ఈ ఎన్జీఓకి చెందిన ఒక వాలంటీర్ చెప్పారు.
జీవితంలో మార్పు తెచ్చాయి
గుజరాత్‌లోని కడి ప్రాంతంలో ప్రియా పుట్టి పెరిగారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ నుండి భౌతికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి స్పేస్ సైన్సెస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె గతంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేశారు. ఆమె తన విద్యను పూర్తి చేయడానికి 2005లో లండన్‌కు వెళ్లే ముందు గాంధీనగర్‌లోని పాఠశాలకు వెళ్లింది. తన తల్లిదండ్రుల నుండి అనేక సమస్యలు ఉన్నప్పటికీ, తనకు లభించిన కొన్ని అవకాశాలు తన జీవితంలో మార్పు తెచ్చాయని ఆమె నమ్ముతుంది. ఆ ఫలితంగా భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన ఇంకా అర్హులైన పిల్లలకు ఇలాంటి అవకాశాన్ని అందించాలని ఆమె కోరుకుంటుంది.
కళాకారిణి కూడా...
ప్రియా నాసాతో కలిసి పని చేసే సమయంలో ఓ శాస్త్రవేత్తకు ''కల నిజమైంది'' అని తన గురించి అభివర్ణించారు. నాసాతో తన అనుబంధాన్ని కొనసాగాలని ఆకాంక్షించారు. ఆమె తన అత్యున్నత ఆశయాలతో పాటు ఏరోబాటిక్స్, స్టంట్లను కూడా అభ్యసిస్తున్నారు. ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం కళాకారిణి కూడా. 12 సంవత్సరాల పాటు ప్రియా నాట్య కళను అభ్యసించారు. స్థానికంగా, అంతర్జాతీయంగా ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.
రాకెట్ ఉమెన్
ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత గురుత్వాకర్షణ తరంగ అబ్జర్వేటరీ అయిన లేజర్ ఇంటర్ఫెరోమెట్రీ స్పేస్ యాంటెన్నా (లేదా ఎస్ఐఎస్ఏ)గా పిలువబడే రాబోయే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే మిషన్‌పై సిస్టమ్ ఇంజనీర్‌గా ఇఎస్ఏతో కలిసి పనిచేసిన పటేల్ 2034లో దాన్ని ప్రారంభించనున్నారు. ఇది ''రాకెట్ ఉమెన్'' బందంతో కలిసి స్టీమ్ కెరీర్లను ఎంచుకునేలా బాలికలకు, ముఖ్యంగా భారతీయులకు అధికారం ఇస్తుంది. ప్రియా ప్రస్తుతం నాసాతోట జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ సమన్వయంతో యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుండి తన పిహెచ్‌డిని కొనసాగిస్తోంది. ఆమె యూరో పియన్ స్పేస్ ఏజెన్సీ కోసం ఎక్సోమర్స్ రోవర్లో కూడా పని చేస్తోంది. ఇది వచ్చే ఏడాది ఎగరబోతోంది. అలాగే అంగారక గ్రహంపై నీటిని అంచనా వేయడానికి కూడా ప్రయత్నిస్తుంది.