Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తినే ఆహారం విషయంలో కావచ్చు, ఆహారం తీసుకునే టైమింగ్‌లో కావచ్చు లేదా రోజువారీ వ్యాయామాల విషయంలో కావచ్చు, శరీరాన్ని ఫిట్‌గా,అలాగే హెల్దీగా దీర్ఘకాలంపాటు ఉంచుకోవడమే మన అందరి లక్ష్యం. ఇంట్లో చేసే వ్యాయామం గురించి ఆలోచించరు. వ్యాయామం అనగానే మొదటగా జిమ్ మాత్రమే గుర్తొస్తుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే జిమ్ముకి వెళ్లడమే మార్గమని మీరు భావిస్తే అది తప్పే. పదే పదే జిమ్కివెళ్లడం వలన కలిగే నష్టాలు ఏంటో ఒకసారి తెలుసుకోండి...జిమ్‌లో హార్డ్ కోర్ ఎక్సర్సైజులుకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సాధా రణంగా దీని కోసం ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన ఆహారంపై కోరిక పెరుగుతుంది అలాగే దీని ప్రభావం జంక్ ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. ఇది మన పొట్టని నింపుతుంది గాని ఇందులో పోషకాలు ఉండవు. జిమ్‌కి రెగ్యులర్‌గా వెళ్లాలనుకున్నా కొన్నిసార్లు వెళ్లడం కుదరదు. మనకు కొత్తలో జిమ్ వెళ్లి కొవ్వును కరిగించుకోవాలి అన్న ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. జిమ్‌కి వెళ్లడం వల్ల డబ్బు కూడా వధా అవుతుంది.
జిమ్‌లో జాయిన్ అయిన వెంటనే శరీరానికి మించిన వ్యాయామాలు చేయడానికి మొగ్గు చూపుతారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక రకంగా మంచిదే.. కానీ అతిగా చేస్తే తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంది. మోకాల్లో గాయాల తీవ్రత ఎక్కువ అయితే మెడిసిన్ కూడా అవసరం పడవచ్చు. జిమ్ అనేది అడిక్టివ్. జిమ్‌కి వెళ్లే వారికి ఈ సమస్య ఎదురు కావచ్చు. అలాంటి వారు కొద్దిరోజులు విరామం తీసుకుంటే శరీరం, చర్మం అసౌకర్యం పెరుగుతుంది. తద్వారా ఆందోళన డిప్రెషన్ వంటి వాటికి లోనవుతారు. వ్యాయామం చేసే పద్ధతిలో ఎక్సర్ సైజులను తరచూ మార్చాలి. ఎందుకంటే ఒకే షెడ్యూల్‌కు అల వాటు పడితే జిమ్ ఫలితాలు పూర్తి వ్యతి రేకంగా ఉంటుంది. జిమ్ అందరికీ ఇళ్ళకి దగ్గరగా ఉండకపోవచ్చు. జిమ్‌కి వెళ్ళడానికి సమయం పట్టవచ్చు. దాంతో డబ్బుని, సమయాన్ని వధా చేయవలసి వస్తుంది.