Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలకు సొంత పొదుపు చాలా ముఖ్యం. డబ్బును ఎలా ఆదా చేయాలి... పెట్టుబడి ఎలా పెట్టాలి అనే విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఈ విషయంలో మహిళలకు పూర్తి అవగాహన కలిగివుండాలి. క్రెడిట్ కార్డు వినియోగం తగ్గించాలి. వీలైన చోట డెబిట్ కార్డ్‌కి మారాలి. తద్వారా మీ ఖాతాలో ఎంత డబ్బు మిగిలి ఉందో తక్షణమే తెలుస్తుంది.
ఇప్పుడే ప్రారంభించాలి: తర్వాత చేస్తానన్న వైఖరిని విడిచిపెట్టాలి. పొదుపు ఇప్పుడే ప్రారంభించాలి. మీ జీతంలో కనీసం పది శాతం పొదుపులో పెట్టండి. మీకు వీలైతే కొంచెం ఎక్కువ పెట్టండి. కానీ ఇప్పుడే ప్రారంభించండి, మీరు ఎంత సంపాదించినా ఫర్వాలేదు.
నియంత్రించండి: షాపింగ్‌లో మునిగిపోతే... మీ డబ్బు వృధా అయిపోయినట్టే. మీరు వెంటనే దానిని నియంత్రించుకోవాలి. ఇది కేవలం క్షణిక ఆనందాన్ని ఇస్తుంది. మీ ఖాతాను ఖాళీ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా అవసరమైన వాటి జాబితాను రూపొందించండి, దానికే కట్టుబడి ఉండండి.
పెట్టుబడులు: మీరు ఎంత పంపాదిస్తున్నా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఒక మొత్తాన్ని ఉంచండి. బీమా పాలసీలు మొదలైనవాటిని తెరవండి. మీకు బంగారంపై ఆసక్తి కలిగి ఉన్నట్టయితే, అనేక పెద్ద బంగారు బ్రాండ్లు అందించే కిట్టీతో టై అప్ చేయండి. ఆపై మెచూరిటీ ముగింపులో మీరు ధరించే లేదా పెట్టుబడిగా కొనుగోలు చేసే వస్తువును కొనుగోలు చేయండి.
బడ్జెట్: వారానికో లేదా నెలవారీ బడ్జెట్‌ను రూపొందించి దానికి కట్టుబడి ఉండండి. ఆ బడ్జెట్లోనే మీ ఖర్చులన్నింటినీ నిర్వహించండి. మీ డబ్బు ఎక్కడికి వెళుతుందో, మీరు దేనికి ఖర్చు చేస్తున్నారో మీకు తెలిసేలా అన్నింటినీ రాయండి.
అత్యవసర నిధి: మీ వద్ద అత్యవసర నిధి ఉందని నిర్ధారించుకోండి. ఎవరైనా మీకు బహుమతి కొద్ది మొత్తాన్ని ఇస్తే ఆ డబ్బులను మీ సొంతానికి కూడా ఉపయోగించకుండ, దాన్ని మీ అత్యవసర నిధిలో భాగం చేసుకోండి.