Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నిండైన ఆరోగ్యం తప్పనిసరి. వ్యాయామంతో శరీరం, ధ్యానంతో మనసూ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే విటమిన్లు, ఖనిజ లవణాలున్న ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. చర్మసౌందర్యాన్నీ ముందు నుంచి కాపాడుకోవాలి. అప్పుడే నలభయ్యోపడిలో చర్మంలో కలిగే మార్పులను ముందే నియంత్రించు కోవచ్చు. తీరా చేయిదాటాక చర్యలు చేపట్టినా ఫలితం పొందడం కష్టమే.
- సంపాదన మొదలైనప్పటి నుంచే మూడోవంతు పొదుపు తప్పనిసరి. బాధ్యతలుంటే వాటికి విడిగా ఓ ఖాతా తెరిచి జమ చేస్తుండాలి. భూమి, బంగారం వంటి వాటిపై పెట్టుబడి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆరోగ్యబీమానూ చిన్నవయసు నుంచే మొదలుపెడితే పాలసీ తక్కువగా ఉంటుంది. అనుకోని ప్రమాదాలు, అనారోగ్యాలకు ఈ పొదుపు రక్షణగా ఉంటుంది.
- మారుతున్న టెక్నాలజీ దష్ట్యా నిరంతరం నేర్చుకోవడం ఇప్పుడు సాధారణమైంది. ఇప్పటివరకూ అమ్మా నాన్నే వెచ్చించారు కదా. ఇకపై వీటి కోసమూ మీరు కొంత పక్కన పెట్టుకోండి. ఎలాగూ ఉద్యోగం వచ్చిందిగా అన్న ధోరణి వద్దు. కొత్తవాటిపై అవగాహన పెంచుకోవాలి. వంటపైనా దష్టిపెడితే ఒంటరిగా ఉండాల్సి వస్తే ఉపయోగ పడుతుంది. సమయం లేక పక్కన పడేసిన అభిరుచులపైనా దష్టిపెట్టండి. వాటిని ప్రయత్నించడానికీ ఇదే సరైన సమయం. స్నేహితులు, బంధువులకు కొంత సమయం కేటాయిస్తుండండి. ఇప్పటి నుంచే దీన్నీ ప్లాన్ చేసుకుంటే మంచిది.