Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేకప్, సౌందర్య సాధనాలు సాధారణంగా అందరూ వాడుతుంటారు. అయితే అవి పొరపాటున బట్టలు మీద పడితే ఆ మరకలు చూడటానికి చాలా అగ్లీగా కనిపిస్తాయి. ఆ మరకలను తొలగించడం చాలా కష్టం. అయితే దీనికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. సాధారణ సబ్బు లేదా డిటర్జెంట్‌తో సౌందర్య సాధనాల మరకలను తొలగించలేం. అలాంటప్పుడు ఎక్కువ మంది డ్రై క్లీనింగ్ గురించి ఆలోచిస్తారు కానీ ఈ మరకలను ఇంట్లో కూడా తొలగించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. అమ్మోనియా, బేకింగ్ సోడా మిశ్రమంతో కాస్మొటిక్ మరకలను సులభంగా తొలగించవచ్చు.
నెయిల్ పాలిష్ పడితే: బట్టలపై నెయిల్ పాలిష్ పడితే భయపడకండి. నెయిల్ పాలిష్ రిమూవర్‌ని మరకపై రాసి, అది మాయమయ్యే వరకు సున్నితంగా రుద్దండి. రిమూవర్ మరకను తొలగించకపోతే, అప్పుడు మరోమార్గం ఉంది రబ్బింగ్ ఆల్కహాల్ ఉపయోగించండి. కాటన్ గుడ్డ ముక్కలను ఆల్కహాల్లో ముంచి అక్కడికక్కడే రుద్దండి. దాంతో మరక లైట్ అయిపోతుంది. తర్వాత బట్టల రంగు తేలికగా ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో బ్లీచ్ చేయండి.
- లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, సౌందర్య సాధనాల నుంచి మరకలను తొలగించడానికి వెనిగర్ ఉపయోగించండి. గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలపి మిశ్రమాన్ని తయారు చేయండి. అందులో తడిసిన గుడ్డను 20-25 నిమిషాల పాటు నానబెట్టి రుద్దితే సౌందర్య సాధనాల కాస్మొటిక్ మరకలు క్రమంగా తగ్గుతాయి.
- పెట్రోలియం జెల్లీ బట్టల నుంచి కాస్మెటిక్ మరకలను తొలగించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. పెట్రోలియం జెల్లీని మరకలపై రాయండి. ఆ తర్వాత 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచితే మరక పోతుంది. - మరకలు అస్సలు పోలేదు అనుకుంటే దానిపై షేవింగ్ క్రీమ్ రాయండి కాసేపు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.