Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పని పెరిగినా, ప్రాధాన్యం తగ్గినా.. నెగెటివిటీ, చిన్న విషయాలే పెద్దగా కనిపిస్తాయి. ఇది మంచిది కాదు. ఇలాంటి ఆలోచనలు మరీ పెరిగితే పతనానికి దారితీస్తాయి. కొన్ని మంచి లక్షణాలను అలవాటు చేసుకుంటే వీటి నుంచి బయటపడొచ్చు. అవేంటో చూద్దాం...
మీ మాట, ఆలోచన... అన్నీ సానుకూలంగా ఉండేలా చూసుకోండి. అలాగే ఉండటానికి ప్రయత్నించండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచే పనులు చేయండి. అభిరుచులకు మెరుగులు దిద్దండి. రోజూ తప్పనిసరిగా కాసేపు వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది. రోజులో కొద్దిసేపు కుటుంబానికి కేటాయించండి. మనసు హాయిగా, తేలికగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లోనూ నెగెటివిటీకి దూరంగా ఉండండి.
కోపం ఎదుటివారి కంటే మనకు చేసే చేటే ఎక్కువ. వీలైతే క్షమించడం నేర్చుకోండి. ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి. మనసులోని బాధ, ప్రతికూల భావనలు తగ్గి సంతోషం కలిగించే గొప్ప మార్గమిది. కాబట్టి అవసరమైన వారికి స్నేహపూరిత హస్తం అందించడానికి సిద్ధంగా ఉండండి.
ప్రతిరోజు తప్పకుండా ఓ గంట పాటు వ్యాయామం చేయాలి. వాయిదా వేయొద్దు. నృత్యం, జిమ్‌లో వర్కవుట్లు, యోగా... ఇలా నచ్చిన దాంట్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. వ్యాయామంతో సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. శరీరమూ ఫిట్‌గా ఉంటుంది.
గాసిప్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటివల్ల ఎదుటి వారికేమో కానీ మీ మనసు, మెదడు రెండూ అనారోగ్యంగా మారతాయి. ఇవన్నీ పాటించి చూడండి. సంతోషం మీ చెంత చేరుతుంది. ప